APTF VIZAG: Academic calendar 2021 -22 - AP High School timings and time table - Certain clarifications Memo.No. ESE02/631/2021-SCERT Dated:21/08/2021

Academic calendar 2021 -22 - AP High School timings and time table - Certain clarifications Memo.No. ESE02/631/2021-SCERT Dated:21/08/2021

AP SCERT విడుదల చేసిన ఉన్నత పాఠశాలల టైమింగ్స్, టైంటేబుల్స్ పై క్లారిఫికేషన్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ సంచాలకులు. 

బడి గంటలు 9 నుంచి 4 వరకే స్పష్టతనిచ్చిన పాఠశాల విద్య డైరెక్టర్

 ❇️పాఠశాలల టైమింగ్స్ ఉదయం 9 గంటల

నుంచి సాయంత్రం 4 గంటల వరకేనని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు పేర్కొన్నారు. ఇటీవల ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిర్వహించేలా ఉత్తర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే పాఠశాలల పనివేళలు ఎక్కువగా ఉండటం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగు తుందని, ఉపాధ్యాయులకూ ఇబ్బందికరమని పలు ఉపాధ్యాయ, విద్యార్థి, తల్లిదండ్రుల అసోసియేషన్లు అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో శనివారం టైం టేబుల్ పై మరోసారి స్పష్టతనిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.

❇️ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో కోవిడ్ SOPని తప్పనిసరిగా పాటించేలా డీఈవోలు, RJDలు పర్యవేక్షించాలని సూచించారు. అలాగే ఎస్సీఈఆర్టీ సూచించిన అకడమిక్ క్యాలెండర్ పైనా వివరణ ఇచ్చారు.

 ✳️ఉదయం 8 నుంచి 8.45 వరకు సెల్ఫ్ లెర్నింగ్,

సూపర్‌వైజరీ స్టడీ, వియ్ లవ్ రీడింగ్, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సూచించిన సమయమని పేర్కొన్నారు.

❇️అలాగే సాయంత్రం 4 నుంచి ఐదు గంటల వరకు గేమ్స్ కోసం ఉద్దేశించిన సమయమని తెలిపారు.

 ✳️5 నుంచి ఆరు గంటల వరకు రెమిడియల్ టీచింగ్, లైబ్రరీ, వియ్ లవ్ రీడింగ్ కోసం ఉద్దేశించి సూచించినవేనని, ఇవి విద్యార్థులకు ఆప్షన్లలే కానీ నిబంధనలు కావని స్పష్టంచేశారు. 

✳️కనుక పీఈటీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు హాజరుకు మినహాయింపు ఇవ్వొచ్చన్నారు. 

❇️అలాగే ఉదయం 8 నుంచి 8. 45 వరకు నిర్వహించే సూపర్ వైజరీ స్టడీకి ఉపాధ్యాయులు స్వచ్చందంగా అయితేనే హాజరు కావొచ్చని పాఠశాల విద్య డైరెక్టర్ చినవీరభద్రుడు స్పష్టం చేశారు.

No comments:

Post a Comment