APTF VIZAG: 16-8-2021 నుండి ఎ.పి లోపాఠశాలలు ప్రారంభం మార్గదర్శకాలు

16-8-2021 నుండి ఎ.పి లోపాఠశాలలు ప్రారంభం మార్గదర్శకాలు

తరగతికి 20 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి.కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలి.

తరగతికి 20 మంది చొప్పున గదులు సరిపోతే..రోజూ అన్ని తరగతులను నిర్వహించాలి

విద్యార్థులకు జ్వరం,జలుబు వంటి  లక్షణాలు ఉంటే పాఠశాలకు అనుమతించ రాదు.తగ్గిన తరువాత మాత్రమే అనుమతించాలి.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు,మరో ఇద్దరు టీచర్స్ తో కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి SOP ను అమలుచేస్తూ మండల టాస్క్ ఫోర్స్ తో అనుసంధానం కావాలి.

విద్యార్థులకు హాజరు నిర్బంధం కాదు. తల్లిదండ్రుల అంగీకారం(పత్రం) తోనే పిల్లలను పాఠశాలకు అనుమతించాలి.

తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అసెంబ్లీ,గేమ్స్,గ్రూప్ వర్క్స్ కు విద్యార్థులను అనుమతించరాదు

పాఠశాల ప్రారంభించిన తరువాత మొదటగా కోవిడ్ కాలంలో కోల్పోయిన అభ్యసన స్థాయిలు పెంచడం పైనే ప్రధానోపాధ్యాయులు దృష్టి పెట్టాలి. తరువాతే రెగ్యులర్ పాఠ్యాంశాల బోధన

ఏ ఒక్కరికి కోవిడ్ లక్షణాలు కనిపించినా వారిని తరగతి నుండి వేరుచేసి... టెస్టింగ్ కు పంపించాలి

నోట్ బుక్స్,పెన్స్, పెన్సిల్స్ మరియు ఇతర వస్తువులు ఒకరినుండి మరొకరు తీసుకోవడం నిషేధం.

కోవిడ్ కాలంలో తల్లి,లేక తండ్రిని  కోల్పోయిన పిల్లలకు యూనిఫామ్ లేదని, మెటీరియల్ లేదనే కారణంతో  వారిని నియంత్రించరాదు.

మధ్యాహ్న భోజనం కార్యక్రమం విద్యార్థులు దూరం (6 feet) పాటింప చేస్తూ అమలు చేయాలి.

కోవిడ్ ప్రోటోకాల్ నిరంతరం పాటిస్తూ  విద్యార్థులను అప్రమత్తం చేయాలి.రోజులో ఒక పీరియడ్ దీనికి కేటాయించాలి.

No comments:

Post a Comment