APTF VIZAG: Whatsap Multi Devices Support Option introduced

Whatsap Multi Devices Support Option introduced

వాట్సాప్ మల్టీ డివైజ్‌ సపోర్ట్ ఫీచర్‌ బీటా వెర్షన్‌ను యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ ఫీచర్ సాయంతో యూజర్స్ ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించవచ్చు.

మన ఖాతా ఉన్న ఫోన్ కాకుండా మరో నాలుగు డివైజ్‌ (ల్యాప్‌టాప్, ట్యాబ్‌, డెస్క్‌టాప్‌)లలో లాగిన్‌ కావచ్చు.

ఎలా ఉపయోగించాలి::

వాట్సాప్ మల్టీ డివైజ్‌ ఫీచర్ ఉపయోగించాలంటే మందుగా మీ ఫోన్లో కుడివైపు మూడు చుక్కలపై క్లిక్ చేస్తే లింక్‌ డివైజ్‌ ( *ప్రస్తుతం బీటా యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది*) అనే ఆప్షన్ కనిపిస్తుంది. 

 దానిపై క్లిక్ చేస్తే ఫింగర్ లేదా పాస్‌వర్డ్ అథెంటికేషన్ అడుగుతుంది. (ఈ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే) తర్వాత మీరు లాగిన్ అవ్వాలనుకుంటున్న డివైజ్‌లో వాట్సాప్‌ వెబ్ ఓపెన్‌ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్ చేస్తే మీ వాట్సాప్‌ ఖాతా అందులో కూడా ఓపెన్ అవుతుంది. 

అలా మీరు ఒకేసారి వాట్సాప్ ఖాతా ఉన్న ఫోన్ కాకుండా మరో నాలుగు డివైజ్‌లలో యాక్సిస్ చెయ్యొచ్చు.

ఒకవేళ మీ ఫోన్ స్విచ్‌ఆఫ్ అయినా మీరు లాగిన్ అయిన నాలుగు డివైజ్‌ల నుంచి వాట్సాప్‌ను ఉపయోగించుకోవచ్చు. 

అలానే మీ కాంటాక్ట్ లిస్ట్‌, ఛాట్‌ హిస్టరీ అన్ని వేర్వేరుగా సదరు డివైజ్‌లకు కనెక్ట్ అవుతాయని వాట్సాప్ పేర్కొంది.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results