APTF VIZAG: ఆగస్టు 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం-శ్రీ చిన వీరభద్రుడు

ఆగస్టు 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం-శ్రీ చిన వీరభద్రుడు

ఉపాధ్యాయులకు కరోనా టీకా త్వరలో ముగియనుండటంతో ఆగస్టు 15న జెండా వందనంతో పాఠ శాలలను పునఃప్రాంభించేందుకు చర్యలు తీసు కొంటున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్య శాఖ డైరె క్టర్ కె. చినవీరభద్రుడు తెలిపారు. 

గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం పెదనెమలిపురిలో నాడు-నేడు ద్వారా అభివృద్ధి చేసిన పాఠ శాలలను ఆయన గురువారం పరిశీలించారు. 

ఈ సందర్భంగా వీరభద్రుడు మాట్లాడుతూ ఆగస్టు 16 నుంచి 30 వరకు విద్యార్థులను అభ్యసనానికి సిద్ధం చేసి, 

సెప్టెంబరు ఒకటి నుంచి తరగతులు నిర్వహించాలని భావిస్తు న్నట్లు చెప్పారు.

అంగన్వాడీలను నిర్వీర్యం చేస్తారని వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదనిస్థలం లేని చోట్ల పాఠశాలల్లోనే భవనాలు నిర్మించి పూర్వ విద్య నుంచి పదో తరగతి వరకు ఒకే ఆవరణలోకి తీసుకు వచ్చి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. 

రెండేళ్లలో సుమారు ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడమే తప్ప ఒక్క ఉద్యోగం రద్దు కాదన్నారు. రెండో విడత నాడు- నేడు కింద రాష్ట్రంలో 25 వేల అదనపు తరగతి గదులను నిర్మించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారన్నారు. 

అవసరమైతే పదో తరగతి సిలబస్ లో రెండు అధ్యాయాలు తొలగించేందుకు యోచిస్తున్నట్లు చెప్పారు.

No comments:

Post a Comment