APTF VIZAG: ఆన్లైన్ తరగతులు జరుపుతున్న క్రమములో ఉపాధ్యాయులు పాటించవలసిన అంశాలు

ఆన్లైన్ తరగతులు జరుపుతున్న క్రమములో ఉపాధ్యాయులు పాటించవలసిన అంశాలు

1.  విద్యార్థుల కొత్త       హాజరుపట్టికలలో పేర్లు నమోదుచేయాలి.

2. విద్యార్థుల తరగతివారి లిస్టులు తయారు చేసి వారి తండ్రిపేరు, మొబైల్ నెంబర్, TV/ మొబైల్ ద్వారా ఆన్లైన్ క్లాసులు ఎలా వింటున్నారో నమోదుచేయాలి.

3. విద్యార్థులను తరగతి వారీగా సబ్జెక్టు గ్రూపులుగా వాట్సాప్ గ్రూపులతో నమోదు చేయాలి.

4. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయబృందం మాట్లాడి ఆన్లైన్ క్లాసుల ఆవశ్యకతను వివరించాలి.

5. తరగతివారీగా ఉపాధ్యాయులు ఇంచార్జి తీసుకోవాలి.

6. టీవీ, సెల్ ఫోన్ లేనిపిల్లలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి మీ లిస్టులలో నమోదుచేయాలి.

7.  ప్రతిరోజూ Time Table ను పిల్లలకు పంపించాలి.

8. ఉపాధ్యాయులు 50% చొప్పున 2గ్రూపులుగా విభజించబడి రోజు ఒక గ్రూప్ హాజరు కావాలి. ఈ గ్రూపుల వివరాలు పై అధికారులకు అందజేయాలి.

9. ఆన్లైన్ క్లాసుల వర్క్ షీట్ ల తోపాటు ఉపాధ్యాయులు కూడా స్వంతంగా వర్క్ షీట్లు ఇచ్చి నిరంతరం పర్యవేక్షించాలి.

10. విద్యార్థులకు మూల్యాంకన పరీక్షలు నిర్వహించి వారి ప్రగతిని నమోదుచేయాలి.

11. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ వచ్చిన వెంటనే అందించాలి.

12. నూతన విద్యార్థులను నమోదు చేసుకోవాలి. TC పై వత్తిడి చేయకపోయినా, కనీసం study , Date of Birth సర్టిఫికెట్లు తెచ్చుకోమనాలి.

13. Work from home ఉన్న రోజు ఇంటివద్దనుండి విద్యార్థులకు కాల్ చేయాలి.

14. వీలయితే స్వంతంగా డిజిటల్ క్లాసులు తయారు చేసుకొని మీకు అనుకూలించిన సమయంలో విద్యార్థులకు బోధించవచ్చు.

15. విద్యార్థులకు త్వరలో రెగ్యులర్ తరగతులు జరుగుతాయని, పరీక్షలుంటాయని శ్రద్దగా ఆన్లైన్ తరగతులు వినాలని చెప్పాలి.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4