APTF VIZAG: ఏపీ కి రావాలంటే కరోనా టెస్ట్ తప్పనిసరి కరోనా నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ కి రావాలంటే కరోనా టెస్ట్ తప్పనిసరి కరోనా నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

విదేశాల నుండి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టులోనే టెస్టులు చేసి నెగిటివ్ వస్తేనే ఇంటికి పంపుతున్నారు.

పాజిటివ్ వచ్చిన వారిని క్వారెంటైన్ కేంద్రాలకు పంపనుండగా ఇప్పుడు రోడ్డు మార్గంలో వచ్చినా టెస్టులను తప్పనిసరి చేశారు.

రాష్ట్రంలోని అన్ని సరిహద్దుల వద్ద యుద్ధప్రాతిపదికన టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపనున్నట్లు ప్రకటించారు.

 కాగా ఎయిర్ పోర్టుల వద్ద జనం గుమిగూడకుండా ప్రయాణికుడితో పాటు కారు డ్రైవర్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని, బంధువులు ఎవరూ రావొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది

No comments:

Post a Comment