APTF VIZAG: Ap Cabinet Decissions

Ap Cabinet Decissions

ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు ఇవే!

బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ, సహా ప్రైవేటు వాహనాల రాకపోకలపై నిషేధం. అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు, దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాల సేవలు కూడా రద్దు.

ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా నుంచి ఆక్సిజన్‌ రప్పించేందుకు చర్యలు.

బీసీల రిజర్వేషన్లు మరో పదేళ్లు పెంపు.

ఈనెల 13న రైతు భరోసా తొలి విడత జమ. 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4వేల 40 కోట్లు జమ. మే 25న 38లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,805 కోట్లు జమ.

వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కింద కుటుంబానికి రూ.10వేలు పరిహారం. 2021 మే 18న మరో 1లక్షా 460మందికి అందజేత.

రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ చేశాం. గత ప్రభుత్వ బకాయిలు పెట్టిన ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అందజేత.

ప్రభుత్వ పాఠశాలల్లో 7వ నుంచి సీబీఎస్‌ఈ ద్వారా విద్యా బోధన. 2024-25 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ విధానంలో చదువుకుని, పరీక్ష రాస్తారు. రాష్ట్రంలోని 44,639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానం అమలు.

2018-19 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో 52,23,000 విద్యార్థులు ఉంటే, 2020-21 సంవత్సరానికి ఆ సంఖ్య 59,30,000 చేరింది.

నాడు-నేడు కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.

 ఏపీలో మూసేసిన సహకార డెయిరీలను అమూల్‌కు లీజుకిస్తున్నాం. మొత్తం  708 గ్రామాల్లో అమూల్‌ సేవలు

అర్చకులకు రూ.10వేల నుంచి రూ.15వేల గౌరవ వేతనం పెంపు. బి కేటగిరి ఆలయాల్లో రూ.5వేల నుంచి రూ.10వేల గౌరవ వేతనం

ఇమామ్‌లకు రూ.5వేల నుంచి రూ.10వేల గౌరవ వేతనం పెంపు. మౌజమ్‌లకు రూ.3వేల నుంచి రూ.5వేల గౌరవ వేతనం

No comments:

Post a Comment