APTF VIZAG: గ్రామాల్లో వైరస్‌.. కట్టడికి కేంద్రం మార్గదర్శకాలు!

గ్రామాల్లో వైరస్‌.. కట్టడికి కేంద్రం మార్గదర్శకాలు!

గ్రామీణ ప్రజల్లో తీవ్ర అనారోగ్యం, శ్వాస సమస్యలపై నిఘా పెట్టాలి

ఆశా, ఆరోగ్య కార్యకర్తలతో కొవిడ్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి

కొవిడ్‌ లక్షణాలున్నవారికి ప్రాథమిక వైద్య సిబ్బందితో టెలిమెడిసిన్‌ వైద్య సేవలందించాలి

 కొవిడ్‌ సోకిన వారిలో ఇతర ఆరోగ్య సమస్యలున్నట్లుయితే వారిని జనరల్‌ ఆసుపత్రికి తరలించాలి

కొవిడ్‌ బాధితులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి

రోగుల ఆక్సిజన్‌ స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోతున్న వారిని ఆస్పత్రులకు తరలించాలి

గ్రామాల్లో సరిపడా పల్స్‌ ఆక్సీమీటర్లు, థర్మామీటర్లను అందుబాటులో ఉంచాలి. ఆక్సీమీటర్లు వాడిన ప్రతిసారి వాటిని శానిటైజ్‌ చేయాలి

దాదాపు 85శాతం మందిలో కొవిడ్‌ లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయి. ఇలాంటి వారు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందాలి

ర్యాపిడ్‌ పరీక్షలపై ఏఎన్‌ఎం, సీహెచ్‌వోలకు శిక్షణ ఇవ్వాలి.అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లోనూ కొవిడ్‌ పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాలి

కొవిడ్‌ బాధితులందరికీ హోమ్‌ ఐసోలేషన్‌ కిట్లు అందించాలి. కేసుల సంఖ్య, వైరస్‌ తీవ్రతను బట్టి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ తప్పనిసరిగా చేయాలి

ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, వాలంటీర్ల ద్వారా స్థానిక సేవలను ముమ్మరం చేయాలి

No comments:

Post a Comment