కొవిడ్ వల్ల అనాథలైతే రూ.10 లక్షలు. కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌తో మరణించిన వారి పిల్లలను ఆదుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు. కరోనా కారణంగా అనాథలైన పిల్లలకు రూ.10 లక్షల ఆర్థికసాయం చేయనున్నారు. ఈ మొత్తాన్ని పిల్లల పేరిట బ్యాంకులో ఎఫ్‌డీ చేయనున్నారు. ఈ ఆర్థికసాయంపై ఒకట్రెండు రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
No comments:
Post a Comment