APTF VIZAG: Proning: ఆక్సిజన్‌ లెవెల్స్‌ పెంచుకోండిలా.కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు

Proning: ఆక్సిజన్‌ లెవెల్స్‌ పెంచుకోండిలా.కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు

ప్రోనింగ్‌ ద్వారా శ్వాస తీసుకునే విధానం

మొదట మంచంపై బోర్లా పడుకోవాలి.

ఒక మెత్తటి దిండు తీసుకుని మెడ కిందభాగంలో ఉంచాలి.

ఛాతి నుంచి తొడ వరకూ ఒకటి లేదా రెండు దిండ్లను ఉంచవచ్చు.

మరో రెండు దిండ్లను మోకాలి కింద భాగంలో ఉండేలా చూసుకోవాలి. (పై చిత్రంలో చూపిన విధంగా)

ఇక ఎక్కువ సమయం పడకపై ఉండే రోగులకు రోజంతా ఒకేవిధంగా కాకుండా పలు భంగిమల్లో విశ్రాంతి తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. ఒక్కో స్థానంలో 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు పడుకోవచ్చు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

భోజనం చేసిన తర్వాత గంట వరకు ప్రోనింగ్‌ చేయవద్దు.

తేలికగా, సౌకర్యవంతంగా అనిపించినంత వరకు మాత్రమే ప్రోనింగ్‌ చేయండి.

పలు సమయాల్లో రోజులో గరిష్ఠంగా 16 గంటల వరకు ప్రోనింగ్‌ చేయవచ్చు.(వైద్యుల సూచనల మేరకు)

హృద్రోగ సమస్యలు, గర్భిణిలు, వెన్నెముక సమస్యలున్నవారు ఈ విధానానికి దూరంగా ఉండాలి.

ప్రోనింగ్‌ సమయంలో దిండ్లను సౌకర్యవంతంగా ఉండేలా ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు.

ప్రయోజనాలు.

ప్రోనింగ్‌ పొజిషన్‌ వల్ల శ్వాసమార్గం సరళతరమై గాలి ప్రసరణ మెరుగవుతుంది.

ఆక్సిజన్‌ స్థాయులు 94శాతం కంటే తక్కువకు పడిపోతున్న సమయంలోనే ప్రోనింగ్‌ అవసరం.

ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ స్థాయులు, రక్తంలో చక్కెర స్థాయులను  పరిశీలించడం ఎంతో ముఖ్యం.

మంచి వెంటిలేషన్‌, సకాలంలో ‘ప్రోనింగ్‌’ చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్

No comments:

Post a Comment