మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోండి. మనకు తెలియకుండానే మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోవచ్చు.
దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను విజయవాడ టెలికాం విభాగం(డీవోటీ) రూపొందించి సోమవారం ప్రారంభించింది.
అనే వెబ్‌సైట్‌లో మొబైల్ నంబరు.. దానికి వచ్చే ఓటీపీ నమోదు చేయగానే మన పేరుమీద ఉన్న ఫోన్ నంబర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద ఉన్న వాటిని సెలక్ట్ చేసి సబ్మిట్ చేస్తే.. టెలికం శాఖ చర్యలు తీసుకుంటుంది. ‘‘ఒకరి పేరు మీద అత్యధికంగా 9 నంబర్లు ఉండేందుకు వీలుంది. కొందరి పేర్ల మీద అంతకంటే ఎక్కువ నంబర్లు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంభించాం’’ అని విజయవాడ టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాబర్ట్ రవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల అనధికారికంగా వినియోగిస్తున్న నంబర్లకు చెక్ పడనుందని టెలికం వర్గాలు తెలిపాయి. తొలుత ఏపీ, తెలంగాణ టెలికం సర్కిళ్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించామని.. త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోనికి వస్తుందని వెల్లడించాయి.
No comments:
Post a Comment