ఇంటర్మీడియట్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే వచ్చేనెల 5వ తేదీ నుంచి 23 దాకా నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోమారు స్పష్టం చేశారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లను పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై విజయవాడ నుండి జాయింట్ కలెక్టర్లు, ఆర్ఓలు, డిఇఓలతో వీడియోకాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు.
కోవిడ్ తో ప్రమాదం వున్నా తప్పని పరిస్థితుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఏ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలు రద్దు కాలేదని తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు అనివార్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. ఈ సందర్భంగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినందుకు అధికారులను మంత్రి అభినందించారు. ఇంటర్ థియరీ పరీక్షలను కూడా ఇదేవిధంగా విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి బి రాజశేఖర్, కమిషనర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment