Inter Exams: ఏపీలో 1,452 సెంటర్లు వివరాలు వెల్లడించిన విద్యాశాఖ మంత్రి.
Ap ఇంటర్మీడియట్ పరీక్షల యొక్క హాల్ టిక్కెట్స్ ను విడుదల చేయడం జరిగింది. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Click Here To DOWNLOAD INTER HALL TICKETS
bie.ap.gov.in//GetTheoryHallTicketNew.do
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలు, వాటి నిర్వహణ తదితర అంశాలను మంత్రి వివరించారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షల నిమిత్తం 1,452 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతంతో పోల్చితే అదనంగా 41 సెంటర్లనే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 146 సెంటర్లు, అత్యల్పంగా గుంటూరు జిల్లాలో 60 సెంటర్లను పరీక్షల కోసం సిద్ధం చేసినట్లు తెలిపారు. సగటున ప్రతి జిల్లాలో 80కిపైగా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్ల వద్ద కొవిడ్ వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటున్నామని.. ఈ మేరకు పనులను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఆర్‌ఐవోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.
No comments:
Post a Comment