APTF VIZAG: రేపటి నుండి ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు సెలవులు టెన్త్ ఇంటర్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి

రేపటి నుండి ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు సెలవులు టెన్త్ ఇంటర్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి

AP: పది, ఇంటర్‌ పరీక్షలు యథాతథం.పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో పది, ఇంటర్‌పరీక్షలను ప్రస్తుతానికి యథాతథంగా నిర్వహించనున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నామని చెప్పారు. అయితే తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు మంగళవారం నుంచి సెలవులు ప్రకటించారు. వారి విద్యా సంవత్సరం సోమవారంతో పూర్తయినట్లు చెప్పారు.

 రేపటినుంచి (1-9 తరగతులు) పాఠశాలకు సెలవులు

❖ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

❖ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సెలవులు ప్రకటించింది.

❖ రేపటి నుంచి సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. 

❖ రాష్ట్రంలో  పరిస్థితులపై ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. 

❖ ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు. 

❖ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగానే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

❖ విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 

❖ పరీక్షల రద్దుతో గతేడాది మిలిటరీ ఉద్యోగార్థులు నష్టపయారన్నారు. 

❖ పాఠశాలల్లో ఇప్పటి వరకు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించామని మంత్రి చెప్పారు. 

❖ పరీక్షల నిర్వహణ సమయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. 

❖ 1 నుంచి 9 తరగతి విద్యార్థులకు ఇక ఎలాంటి పరీక్షలు ఉండవని.. ఈ ఏడాది విద్యాసంవత్సరం పూర్తయినట్లు మంత్రి సురేశ్‌ స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4