APTF VIZAG: ప్రపంచంలో తొలిసారి భారత్‌లో ఒకేరోజు 4 లక్షల కరోనా కేసులు

ప్రపంచంలో తొలిసారి భారత్‌లో ఒకేరోజు 4 లక్షల కరోనా కేసులు

దేశంలో కరోనా విళయతాండవం చేస్తున్నది. వైరస్‌ విజృంభణతో ప్రతిరోజు పాజటివ్‌ కేసులు భారీసంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో గత 24 గంటల్లో కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. ఒక్కరోజులో 4 లక్షలకుపైగా కేసులు నమోదవడం ప్రపంచంలో ఇదే తొలిసారి. అదేవిధంగా వరుసగా నాలుగోరోజూ మూడు వేలకు పైగా మరణాలు సంభవించాయి.

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 4,08,323 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,91,63,488కు చేరింది. ఇందులో 1,56,71,536 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 2,11,778 మంది మరణించారు. కొత్తగా 2,97,488 మంది డిశ్చార్జీ అయ్యారు. మరో 3464 మంది మరణించారు.

కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 62,919 కేసులు, కర్ణాటకలో 48,296, కేరళలో 37,199 చొప్పున నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో కరోనాతో 828 మంది మరణించగా, ఢిల్లీలో 375 మంది, ఉత్తరప్రదేశ్‌లో 332 మంది మృతిచెందారు.

No comments:

Post a Comment