APTF VIZAG: Some Banks Passbook and Check Books are not Acceptable

Some Banks Passbook and Check Books are not Acceptable

ఏప్రిల్ నుంచి ఈ బ్యాంకుల పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు చెల్లవు.

 కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం(ఏప్రిల్ 1) నుంచి బ్యాంకుల విషయంలో పలు అంశాలు మారబోతున్నాయి. ఈ క్రమంలో... ఆయా బ్యాంకుల పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు పని చేయవు. ఇంకా కొన్ని అంశాలు కూడా మారబోతున్నాయి.

ఇక ఏయే బ్యాంకులకు సంబంధించిన నిబంధనలు మారతాయంటే.

యునైటెడ్ బ్యాంక్, విజయా బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్,  ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, అలహాబాద్ బ్యాంక్ వంటివి విలీనమయ్యాయి. ఈ బ్యాంకులకు సంబంధించిన  పాస్‌బుక్స్, చెక్‌బుక్స్ ఏప్రిల్ నుంచి పని చేయబోవు.

ఇక చెక్ బుక్స్, పాస్‌బుక్స్ మాత్రమే కాకుండా ఐఎఫ్ఎస్‌సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్ వంటివి కూడా మారనున్నాయి. కాగా... ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాక్ వంటివి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమయ్యాయి. 

కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్ విలీనమైంది. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ వంటివి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమయ్యాయి. ఇక అలహాబాద్ బ్యాంక్... ది ఇండియన్ బ్యాంక్‌లో విలీనమైంది. బ్యాంకులు వాటి కస్టమర్లకు ఈ విషయాన్ని ఇప్పటికే సమాచారమిచ్చాయి.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results