APTF VIZAG: ఏపీ వ్యాప్తంగా మాస్క్ ధారణ పై పోలీసుల స్పెషల్ డ్రైవ్. నిన్న ఒక్క రోజునే మాస్కులు ధరించని 18,565 మందికి ఫైన్లు వేసిన పోలీసులు.ఫైన్ల ద్వారా రూ. 17.34 లక్షలు వసూలు చేసిన పోలీసులు.

ఏపీ వ్యాప్తంగా మాస్క్ ధారణ పై పోలీసుల స్పెషల్ డ్రైవ్. నిన్న ఒక్క రోజునే మాస్కులు ధరించని 18,565 మందికి ఫైన్లు వేసిన పోలీసులు.ఫైన్ల ద్వారా రూ. 17.34 లక్షలు వసూలు చేసిన పోలీసులు.

కరోనా మళ్లీ విస్తరిస్తుండడంతో ఏపీలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో  మాస్కులు పెట్టుకోవడంపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మాస్కులు లేకుండా బయటికి వస్తున్నవారికి జరిమానా వడ్డించారు. నిన్న ఒక్కరోజే 18,565 మందికి జరిమానాలు విధించడం ద్వారా రూ.17.34 లక్షలు వసూలు చేశారు.

అత్యధికంగా ప్రకాశం జిల్లా పోలీసులు రూ.2.10 లక్షలు జరిమానాల రూపంలో రాబట్టారు. అత్యల్పంగా రాజమండ్రి అర్బన్ పోలీసులు రూ,2,800 వసూలు చేశారు. కాగా, పలు చోట్ల పోలీసులే మాస్కులు పంచారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. మాస్కులు ధరించిన వారికి గులాబీ పూలు ఇచ్చి అభినందించారు.No comments:

Post a Comment

Featured post

Learning improvement program (LIP) grading process