APTF VIZAG: 31 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్.హాల్ టికెట్ లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

31 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్.హాల్ టికెట్ లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 31 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 వరకు ఈ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. 

Click Here To Download Inter Hall Tickets

ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి వి రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ప్రకారం.. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహిస్తారు. గదికి 10 మందిని మాత్రమే కేటాయించాలి. ఆదివారం సహా రోజుకు రెండు పూటలా పరీక్షలుంటాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 947 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 3,58,474 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ఎంపిసి విద్యార్థులు 2,60,012 మంది ఉండగా బైబిసి విద్యార్థులు 98,462 మంది ఉన్నారు. హాల్ టిక్కెట్లను ఇంటర్మీడియట్ బోర్డు వైబ్ సైట్ bie.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిసి కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షల పర్యవేక్షణకు చీఫ్ సూపరింటెండెంట్ అధికారులను నియమించామని, వీరి మొబైల్ నెంబర్లకు ఒటిపి నెంబర్ వచ్చిన తరువాతే డౌన్లోడ్ చేసుకున్న ప్రశ్నపత్రాలు తెరవాల్సివుంటుందని రామకృష్ణ ఆదేశించారు.

No comments:

Post a Comment