APTF VIZAG: ఏప్రిల్ 9న విద్యాదీవెన ఫీజుల చెల్లింపు

ఏప్రిల్ 9న విద్యాదీవెన ఫీజుల చెల్లింపు

ఏప్రిల్ 9న జగనన్న విద్యాదీవెన కింద ఫీజు చెల్లింపులు చేస్తామని సీఎం జగన్ తెలిపారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనపై సమీక్ష సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 9న రీయింబర్స్ మెంట్, ఏప్రిల్ 27న వసతిదీవెన విడుదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు వేస్తున్నామని తెలిపారు. దీనిద్వారా దాదాపు 10 లక్షలమందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుందన్నారు. ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లలో 50వేల వరకూ పెరుగుదల వచ్చిందని అధికారులు ఈ సందర్భంగా సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఒం గోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు వీలైనంత త్వరగా నిధులను విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖమంత్రి ఆదిమూ లపు సురేష్, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్ సీహెచ్ ఈ) ఛైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today