APTF VIZAG: COVID 19 Medicine Distributed from January 16

COVID 19 Medicine Distributed from January 16

జనవరి 16 నుంచి టీకా పంపిణీ వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 

జనవరి 16 నుంచి టీకా పంపిణీ చేపట్టనున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ప్రాధాన్యత క్రమంలో భాగంగా తొలుత దాదాపు మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత 27కోట్ల మంది 50ఏళ్ల పైబడిన లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్న 50ఏళ్ల లోపు వారికి అందించనున్నట్లు పేర్కొంది. ‘వచ్చే వారంలో మకర సంక్రాంతి, లోహ్రి, మగ్‌ బిహు తదితర పండగలను దృష్టిలో పెట్టుకుని జనవరి 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించాం’ అని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results