ఏపీలో ఇంటర్ అడ్మిషన్లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నలిచ్చింది. జనవరి 18 నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభిస్తారు. గురువారం నుంచి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు తీసుకుంటారు. రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇప్పటికే అనధికారికంగా ఇంటర్ ఫస్టియర్‌లోకి విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మాత్రం ఇంతవరకు అడ్మిషన్లు మొదలుకాలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూనియర్ కాలేజీలు ఇంటర్ అడ్మిషన్లు చేపట్టనున్నాయి. కాగా, కాలేజీలకు గతంలో మాదిరిగానే ఈ విద్యా సంవత్సరంలోనూ ఒక్కో సెక్షన్‌కు 88 మంది వరకు విద్యార్థులను చేర్చుకునే అవకాశం ఏర్పడింది.
ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్లు ఆఫ్‌లైన్‌లోనే జరగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలు గత విద్యా సంవత్సరం వరకు ఉన్న పద్ధతిలోనే 2020-21 విద్యా సంవత్సరం అడ్మిషన్లు కూడా నిర్వహించుకోవచ్చు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో ఫస్టియర్ అడ్మిషన్లు నిర్వహించాలన్న ఇంటర్‌బోర్డు నిర్ణయాన్ని హైకోర్టు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment