APTF VIZAG: YSR pre primary school in all Anganwadi

YSR pre primary school in all Anganwadi

ప్రీ స్కూలు కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన నిధులు విడుదల.ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి వివిధ రకాల ఆట వస్తువులు, పుస్తకాలు.పిల్లలను ఆటపాటలతో అలరించేందుకు వీలుగా ప్రత్యేకంగా యూ ట్యూబ్‌ చానల్‌.8.50 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారంతో పాటు విద్యపై ప్రత్యేక శ్రద్ధ.

ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి ప్రత్యేక కిట్‌

ప్రీ–స్కూల్‌ కార్యకలాపాలకు అవసరమైన అంశాలను అభివృద్ధి చేయడానికి అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్‌ విడుదల చేసింది. ఆటలు, చదువుకు సంబంధించిన సామగ్రితో ప్రీ–స్కూల్‌ కిట్‌ను అంగన్‌వాడీ కేంద్రాలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 

ఈ కిట్‌లో అన్ని రకాల పుస్తకాలు, వివిధ వస్తువులు ఉంటాయి. కిట్‌ విలువ రూ.5 వేలు ఉంటుంది. ప్రతి స్కూలుకు ఒక కిట్‌ను అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 

 అంగన్‌వాడీ స్కూళ్లలో సమూల మార్పులు రాబోతున్నాయి. ఆట పాటల ద్వారా చిన్నారులను అలరిస్తూ విద్యా బుద్ధులు నేర్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రీ స్కూల్‌ సిలబస్‌ను రూపొందించింది. ఇకపై రాష్ట్రంలో అంగన్‌వాడీ స్కూళ్లన్నీ వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లుగా మార్పు చెందుతాయి. ప్రీ–స్కూల్‌ సిలబస్‌కు అనుగుణంగా అన్ని ప్రాజెక్టుల చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ పూర్తయింది. అంగన్‌వాడీ కార్యకర్త హోదాను అంగన్‌వాడీ టీచర్‌గా మారుస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ టీచర్లకు జనవరి 18 నుంచి 22 మధ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.  వీరిలో ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని మెరుగు పరచడానికి కూడా చర్యలు తీసుకుంటోంది. యూ ట్యూబ్‌ లింక్‌ ద్వారా భాగస్వామ్యం చేసి, వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని ప్రీ–స్కూల్‌ పిల్లలు సమర్థవంతంగా విద్య నేర్చుకోవటానికి 25 ముఖ్య కార్యకలాపాల కోసం గుర్తించిన, అభివృద్ధి చేసిన వీడియోలపై అంగన్‌వాడీ టీచర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సహాయంతో ఈ వీడియోలను అభివృద్ధి చేశారు.

No comments:

Post a Comment