SBI ఖాతాదారులకు శుభవార్త..రోజుకు రూ. లక్ష
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఎస్‌బీఐ) తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. విభిన్న శ్రేణుల డెబిట్ కార్డులపై రోజువారీ ఏటీఎం విత్‌డ్రాయల్ పరిమితిని గణనీయంగా పెంచింది.
ఇప్పటివరకు వివిధ కార్డులపై రోజుకి రూ.10 వేల వరకు మాత్రమే గరిష్ఠంగా ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు రోజకి రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది.
వివిధ కార్డులకు ఈ పరిమితి విభిన్నంగా ఉంటుంది
ఎస్‌బీఐ క్లాసిసేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులు ఏటీఎంల ద్వారా ఎనిమిది ట్రాన్సాక్షన్ ల వరకు ఉచితంగా చేసుకోవచ్చని… అంతకు మించితే ఛార్జీలు విధిస్తామని తెలిపింది.
రోజువారీ విత్ డ్రాయల్ లిమిట్ వివరాలు :
క్లాసిక్ మరియు మాస్ట్రో డెబిట్ కార్డు: రోజుకు రూ. 20 వేల వరకు
గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 40 వేలు
గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 50 వేలు
ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 1 లక్ష
ఇన్ టచ్ ట్యాప్ అండ్ గో డెబిట్ కార్డు: రూ. 40 వేలు
ముంబై మెట్రో కాంబో కార్డ్: రూ. 40 వేలు
మై కార్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్: రూ. 40 వేలు
No comments:
Post a Comment