APTF VIZAG: PAN Card: పాన్ కార్డు లేదా?Instant PAN through Aadhaar 10 నిమిషాల్లో ఫ్రీగా తీసుకోండి.

PAN Card: పాన్ కార్డు లేదా?Instant PAN through Aadhaar 10 నిమిషాల్లో ఫ్రీగా తీసుకోండి.

మీ దగ్గర పాన్ కార్డు లేదా? అయితే 10 నిమిషాల్లో తీసుకోవచ్చు. అది కూడా ఉచితంగా. ఎలాగో తెలుసుకోండి.


1. ఒకప్పుడు పాన్ కార్డ్ తీసుకోవాలంటే కనీసం రెండు వారాలైనా పట్టేది. కానీ ఇప్పుడు పాన్ కార్డ్ తీసుకోవాలంటే కేవలం 10 నిమిషాలు చాలు. ఆధార్ బేస్డ్ ఇ-కేవైసీ ద్వారా పాన్ కార్డును వెంటనే జారీ చేసే కొత్త సర్వీస్‌ను ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు.

2. ఈ ఫెసిలిటీ ద్వారా కేవలం 10 నిమిషాల్లో పాన్ కార్డు తీసుకోవచ్చు. ఇందుకోసం మీ ఆధార్ నెంబర్ వెల్లడిస్తే చాలు. 10 నిమిషాల్లో పాన్ కార్డ్ జారీ అవుతుంది. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, నెల, సంవత్సరం లాంటి వివరాలు పూర్తిగా ఉండాలి. మైనర్లు ఇన్‌స్టంట్ ఇ-పాన్ కార్డు తీసుకోలేరు. ఈ కింది స్టెప్స్ ఫాలో అవండి.
3. ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇ-ఫైలింగ్ పోర్టల్  ఓపెన్ చేయండి.


Click Here To Apply ONLINE PAN CARD,పాన్ కార్డు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 ఎడమవైపు Quick Links కింద Instant PAN through Aadhaar లింక్‌పైన క్లిక్ చేయండి.
4. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Get New PAN ట్యాబ్ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Generate Aadhaar OTP పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
5. ఓటీపీ ఎంటర్ చేసి మీ ఆధార్ వివరాలు సరిచూసుకోవాలి. మీ ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత 15 అంకెల అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. వెరిఫికేషన్ పూర్తైన తర్వాత పాన్ కార్డు జారీ అవుతుంది.
6. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI దగ్గర రిజిస్టర్ అయిన మీ ఆధార్ వివరాల ద్వారా మీకు పాన్ కార్డును జారీ చేస్తుంది ఆదాయపు పన్ను శాఖ. ఈ ప్రాసెస్ మొత్తం 10 నిమిషాల్లో పూర్తవుతుంది.
7. Check Status/ Download PAN పైన క్లిక్ చేసి మీ ఇ-పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ ఇ-పాన్ కార్డు పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీ ఇమెయిల్ ఐడీకి వస్తుంది.
8. ఇప్పటివరకు పాన్ కార్డు లేనివాళ్లు ఉచితంగా ఇన్‌స్టంట్ పాన్ కార్డు తీసుకోవచ్చు. 2020 ఫిబ్రవరి 12న ప్రయోగాత్మకంగా ఇన్‌స్టంట్ పాన్ కార్డు సేవలు ప్రారంభమయ్యాయి. 2020 మే 25 వరకు 6,77,680 పాన్ కార్డులు జారీ అయ్యాయని అంచనా.
9. ఇప్పటివరకు పాన్ నెంబర్ లేనివారు మాత్రమే ఇన్‌స్టంట్ పాన్ కార్డు తీసుకోవచ్చు. గతంలో పాన్ కార్డు తీసుకున్నవారు మళ్లీ ఇన్‌స్టంట్ పాన్ కార్డు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టంట్ పాన్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ నెంబర్‌కు తప్పనిసరిగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today