APTF VIZAG: పుదీనా గురించి సంపూర్ణ వివరణ

పుదీనా గురించి సంపూర్ణ వివరణ


ఉపయోగాలు

     ఆయుర్వేదం నందు పుదీనా కు ప్రత్యేక స్థానం ఉన్నది. 100 గ్రాముల పుదీనా ఆకు 56 క్యాలరీల శక్తిని ఇస్తుంది.  ఇవే కాకుండా మరెన్నొ పోషకాలు ఉన్నాయి .

 100 గ్రాముల పుదీనా ఆకులో ఉండే పోషకాలు 

పిండిపదార్దాలు  - 8 .40 గ్రా , ప్రొటీన్స్ - 5 .90 గ్రా , 0 .70 గ్రా ఫ్యాట్స్ , క్యాల్షియం - 440 మి.గ్రా ,  ఫాస్ఫరస్ - 70 మి.గ్రా , ఐరన్ - 19 .2 మి.గ్రా , విటమిన్లు - A , B1 , B2 , నియాసిన్ , ఆక్సాలిక్ ఆసిడ్ ఉన్నాయి. 
🌿పుదీనా ఆకు ఎక్కువుగా మాంసాహార వంటకాలలో వాడతారు . పచ్చడిగా మనవారు చాలాకాలం నుంచి ఉపయోగిస్తున్నారు. పుదీనా ఆకు నుంచి " పిప్పర్మెంట్ " నూనె తయారగును. దీనితో కూడా అనేక వైద్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నూనెని ఘనీభవింపచేసిన మనము కిళ్ళీలలో వాడే " పిప్పరమెంట్ " తయారగును. పిప్పర్మెంట్ నోట్లో వేసుకొనిన వేడిగా ఉండి బయట గాలి కొద్దిగా సోకగానే చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది.

  పుదీనా ఆకుతో చికిత్సలు  - 

🌿పుదీనా ఆకు రసములో 1 స్పూన్ నిమ్మరసం , కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ 3 సార్లు చొప్పున తీసుకొనుచున్న అజీర్తి , కడుపునొప్పి , పొట్ట ఉబ్బరం , పొట్టలో గ్యాస్ , విరేచనాలు , విరేచనములో నులిపురుగులు , రక్తహీనత సమస్యల నుండి విముక్తి లభించును.
🌿పుదీనాకు కషాయం రోజుకి 2 లేక 3 పర్యాయాలు సేవిస్తున్న ఎక్కిళ్లు , దగ్గు , జలుబు , అజీర్తి తగ్గును.
🌿పుదీనాకు కషాయం నందు కొంచం ఉప్పు కలిపి గొంతులో పోసుకొని గార్గిలింగ్ ( గుడగుడ ) చేయుచున్న గొంతునొప్పి తగ్గును.
🌿క్షయ , ఉబ్బసం , కొన్ని ఊపిరితిత్తుల వ్యాధులకు ఆయా మందులతో పాటు ఒకస్పూను పుదీనాకు రసములో 2 స్పూనుల వెనిగార్ , తేనె , కేరట్ రసము కలిపి రోజుకి 2 సార్లు సేవించిన మంచి టానిక్ లా పనిచేస్తుంది .
🌿నోటి దుర్వాసన గలవారు ప్రతిరోజు పుదీనాకు కొంచం నములుతున్న దుర్వాసన నిర్మూలమగును . ఇంకా దంతాలు పుచ్చుట తగ్గిపోయి దంతాలు గట్టిపడును.
🌿దంతాల నుండి చీముకారు సమస్య ఉన్నవారు పుదీనాకు నములుతున్న చీము కారుట తగ్గును. దంతాలు ఊడుట తగ్గును.
🌿ప్రతిరోజూ నిద్రించుటకు ముందు పుదీనాకు ముఖమునకు రాసుకొనుచున్న ముఖంపైన మొటిమలు తగ్గిపోయి ముఖచర్మం మృదువుగా , అందముగా తయారగును.
🌿గజ్జి , దురద వంటి చర్మవ్యాదులలో పుదీనాకు రసం పైపూతగా వాడుచున్న చర్మవ్యాధులు అంతరించును. నొప్పులు తగ్గును.
🌿పిప్పరమెంట్ తైలములో కొద్దిగా పంచదారను కలిపి 2 నుంచి 3 చుక్కలు కడుపులోకి తీసుకొనుచున్న కడుపుబ్బరం , ఆహారం అరగకుండా ఉండటం , అజీర్తి తగ్గును.
🌿కొబ్బరినూనెలో కొద్దిగా పిప్పరమెంట్ తైలం కలిపి కీళ్ళనొప్పులకు పైపూతగా రాయుచున్న గుణం కనిపించును.
🌿గొంతునొప్పికి , గొంతులోని టాన్సిల్స్ కు పైపూతగా పిప్పరమెంట్ తైలాన్ని రాయుచున్న తగ్గును.
🌿పిప్పరమెంట్ నూనెలో కొద్దిగా లవంగ నూనె కలిపి పుచ్చుపళ్ళలో పెడుతున్న నొప్పి తగ్గుటయే కాక క్రమక్రమంగా పుచ్చు అంతరించును.
🌿నిమ్మరసములో కొద్దిగా పిప్పరమెంట్ తైలము కలిపి రాత్రిపూట ఒంటికి పట్టించుకుని పడుకున్న దోమలు దరిచేరవు .

        పైన చెప్పిన యోగాలే కాకుండా విరేచనాలు , జిగటవిరేచనాలు యందు పనిచేయును. హృదయమునకు మంచిది.గర్భాశయ దోషాలను పోగొట్టి రుతుస్రావం సరిగ్గా అగునట్లు చేయును. బాలింతలకు వచ్చు జ్వరం నందు పుదీనాకుల రసం తీసి రెండు చెంచాలు చొప్పున తాగించుట మంచిది . జలుబు నందు పుదీనాకు ముద్దగా చేసి నుదురుకు పట్టించి జలుబు , తలనొప్పి తగ్గును.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today