APTF VIZAG: STATE BANK OF INDIA (SBI )కొత్త రూల్స్.. ఖాతాదారులు తప్పక తెలుసుకోవలసిన అంశాలు

STATE BANK OF INDIA (SBI )కొత్త రూల్స్.. ఖాతాదారులు తప్పక తెలుసుకోవలసిన అంశాలు


🏠అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి*
క్యాష్ విత్‌డ్రా, డిపాజిట్, మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూల్స్ మార్పు సర్వీస్ చార్జీల సవరణ🏠
📡దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులకు అలర్ట్. బ్యాంక్ అక్టోబర్ 1 నుంచి డిపాజిట్లు, క్యాష్ విత్‌డ్రా సర్వీస్ చార్జీలను సవరిస్తోంది. అలాగే మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ పరిమితులు, పెనాల్టీలు కూడా మారబోతున్నాయి.
📡స్టేట్ బ్యాంక్ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ పరిమితిని తగ్గించింది. ఇది కస్టమర్లకు శుభవార్త. పట్టణ ప్రాంతాల్లో పరిమితిని రూ.5,000 నుంచి రూ.3,000 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే సెమీ అర్బన్ బ్రాంచుల్లో మంత్లీ బ్యాలెన్స్ పరిమితి రూ.2,000గా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.1,000 ఉండాలి. ఇక మంత్లీ బ్యాలెన్స్ కలిగి లేకపోతే రూ.10 నుంచి రూ.15 పెనాల్టీ చెల్లించాలి. దీనికి జీఎస్‌టీ అదనం.
📡నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లావాదేవీలు ఆన్‌లైన్‌లో ఉచితం. అయితే బ్రాంచ్‌కు వెలితే చార్జీలు పడతాయి. రూ.10,000 వరకు నెఫ్ట్ ట్రాన్సాక్షన్లకు రూ.2తోపాటు జీఎస్‌టీ చెల్లించాలి. రూ.2 లక్షలకు పైన లావాదేవీకి బ్యాంకు రూ.20తో జీఎస్‌టీ వసూలు చేస్తోంది. రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల మధ్యలో ఆర్‌టీజీఎస్ లావాదేవీలకు రూ.20తోపాటు జీఎస్‌టీ చెల్లించాలి. రూ.5 లక్షల పైన లావాదేవీకి రూ.40తోపాటు జీఎస్‌టీ అదనం.
📡నెలలో మూడు సార్లు డిపాజిట్లు ఉచితంగానే చేసుకోవచ్చు. అటుపైన ప్రతి లావాదేవీకి రూ.50తోపాటు జీఎస్‌టీ చెల్లించాలి. అలాగే నాన్ హోమ్ బ్రాంచ్‌కు రోజుకు రూ.2 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయగలం. అటుపైన డబ్బు డిపాజిట్లను స్వీకరించాలా లేదా అనే అంశం మేనేజర్‌ ఇష్టం
📡మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.25,000 కలిగి ఉంటే నెలకు రెండు సార్లు ఉచితంగానే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. రూ.25 వేల నుంచి రూ.50,000 మధ్యలో మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ ఉంటే 10 సార్లు డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత లావాదేవీకి రూ.50తోపాటు జీఎస్‌టీ చెల్లించాలి

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today