APTF VIZAG: Digital Voter ID download link and process for download

Digital Voter ID download link and process for download

అందుబాటులో డిజిటల్ ఓటర్ కార్డు.. మీ ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోండిలా

 భారతదేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరు ఈ డిజటల్ కార్డును చూపించి ఓటు వేయచ్చు కూడా.

డిజిటల్ కార్డు డౌన్‌లోడ్ ఇలా.

Step 1 -  ముందుగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ https://eci.gov.in/e-epic/ లోకి వెళ్లండి.

Step 2 -  ఈసీ వెబ్‌సైట్‌లో ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ వివరాలతో లాగిన్ కావాలి. లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Step 3 - వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో e-epic Download ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయాలి.

Step 4 - మీ ఓటర్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి, రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసి సెర్చ్ చేయాలి.

Step 5 - వివరాలు అన్ని పూర్తి చేసిన తర్వాత Send OTP పైన క్లిక్ చేయాలి.

Step 6   - ఆ ఓటర్ ఐడీ కార్డుకు లింక్ అయిన మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ వెరిఫై అవుతుంది.

Step 7 - ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Download e-EPIC పైన క్లిక్ చేయాలి.

Step 8 - నాన్ ఎడిటెబుల్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది. అంతే నిమిషాల్లోనే మీ స్మార్ట్ ఫోన్‌లో డిజిటల్ కార్డు ఉంటుంది.

మరోవైపు.. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్నవారు, ఓటర్ ఐడీ లేకపోతే ఫామ్ 6 రిఫరెన్స్ నెంబర్‌తో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, ఈ డిజిటల్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలంటే నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే ఓటర్ ఐడీకి మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకును ఉండాలి.

No comments:

Post a Comment