APTF VIZAG: ప్రవీణ్ ప్రకాష్ మళ్ళీ ఆకస్మిక తనిఖీలు జనవరి నుంచి మొదలు. ఈ సారి జిల్లాల్లోని విద్యాశాఖ కార్యాలయాలు

ప్రవీణ్ ప్రకాష్ మళ్ళీ ఆకస్మిక తనిఖీలు జనవరి నుంచి మొదలు. ఈ సారి జిల్లాల్లోని విద్యాశాఖ కార్యాలయాలు

ఇప్పటివరకువిధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యా యుల గుండెల్లో దడ పుట్టించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఇకపై విధుల పట్ల అలసత్వంగా వ్యవహరిస్తున్న అధికారులపై తనదైన శైలిలో చర్యలు తీసుకోనున్నారు. వచ్చే యేడాది నుంచి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జిల్లా మండలాల్లో ఉన్న విద్యా శాఖ కార్యాలయాలపై ఉక్కుపాదం మోపనున్నారు. ఈ మేరకు అధికారులకు స్వయంగా ముందస్తు హెచ్చరికను జారీ చేయడం కొసమెరుపు. గత నవంబరు నెలలో ఇదే తరహాలో పాఠశాలల పర్యటనకు వస్తున్నా... సిలబస్, వర్క్్బుక్, నోట్బుక్ వ్యవహారల్లో జాగ్రత్త... అంటూటూ ఉపాధ్యాయులకు ముందస్తు హెచ్చరిక జారీ చేశారు. హెచ్చరిక జారీ చేసిన వారం రోజుల వ్యవధిలోనే ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో సిలబస్ సకాలంలో సిలబస్ పూర్తి చేయని సుమారు 200 మంది ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేయడం రాష్ట్ర వాప్తంగా సంచనమైంది. ఇపుడు విద్యాశాఖ అధికారులలో ఇప్పటి నుంచే దడ మొదలైంది. ఉపాధ్యాయులు సైతం ఇకపై అధికారుల వంతు అంటూ చమత్కరించుకోవడం విశేషం. ఇప్పటికే ముఖ్య కార్యదర్శి వద్ద ఆయా జిల్లాలు, మండలాలవారీగా విధుల పట్ల అలసత్వంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నెల21వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించిన ఆయన తోట్లవల్లూరు మండలం, వల్లూరు పాలెం పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఐఎఫ్పీ ఫ్యానల్ లేకపోవడం, టోఫెల్ పై విద్యార్థులడిగిన ప్రశ్నలపై సమాధానం రాకపోవడంతో ప్రవీణ్ ప్రకాష్ అగ్రహించారు. ఆరా తీయగా జిల్లా విద్యాశాఖాధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి పాఠశాలలను పట్టించుకోవడంలేదని గ్రహించారు. ఆ జిల్లా విద్యాశాఖాధికారిణి తహేరా సుల్తానా తీరుపై మండిపడ్డారు. మిగతా జిల్లాల్లోనూ జిల్లా విద్యా శాఖాధికారు లపైనా ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉద్దేశ్యంతో ప్రవీణ్ ప్రకాష్ పర్యటనకు పక్కా ప్రణాళికలను రచించుకున్నారు. ఎప్పుడు ఏ ప్రాంతానికి పర్యటించనున్నది వెల్లడించలేదు. అధికా రులు అప్రమత్తమయ్యే అవకాశం ఉన్న నేపధ్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని నిర్ణయిం చుకున్నారు. ఈ మేరకు జిల్లా మండల విద్యా కార్యాలయాలను సందర్శిం చనున్నట్లు సమాచార మిచ్చారు. దీంతో జిల్లా మండల విద్యాశాఖా ధికారులు, డిప్యూటీ విద్యా శాఖాధికారులలో ఆయన పర్యటన ప్రకంపనలు పుట్టిస్తున్నది. ఈ యేడాది రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి జిల్లాలు, ప్రాంతాల లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ముఖ్యంగా సమ్మెటివ్ పరీక్షలకు సబంధించి ఉపాధ్యాయులకు నిర్దేశించిన సిలబస్ పూర్తి, విద్యార్థుల వర్క్ బుక్, నోట్ బుక్ లో లోపాలు వంటి అంశాలపై ముమ్మర తనిఖీలు నిర్వహించారు. గడిచిన రెండు నెలల వ్యవధిలోనే వందల సంఖ్యలో ఉపాధ్యాయులు సిలబస్ను పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని గుర్తించి మెమోలు జారీ చేశారు.


విద్యాశాఖ కార్యాలయాల వంతు.


ఈ యేడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఏ విధంగా పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించానో అదే రీతిలో 2024 జనవరి నుంచి మండల విద్యాశాఖ కార్యాలయాలు, డిప్యూటీ డిఈఓ కార్యాలయాలు, డీఈఓ కార్యాలయాలను సందర్శిస్తానని ప్రవీణ్ ప్రకాష్ ప్రకటించారు. మండల విద్యాశాఖ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు 9 ఫైళ్లను సెలెక్ట్ చేసుకుని చూస్తానని పేర్కొన్నారు. అలాగే, జనవరి 23 నుంచి 29 వరకు ఎఫ్ఎ 3 పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.

No comments:

Post a Comment