సెల్ఫీ విత్ టాపర్స్
సెల్ఫీ విత్ టాపర్స్ నేను చెప్పిన విధంగా అందరూ చక్కగా సెల్ఫీ తీసి నా వాట్సాప్ నెంబర్ కి పంపడం జరిగింది. ఇచ్చిన సూచనలను పాటించినందుకు అందరికీ అభినందనలు.
✏️నా వాట్సప్ పూర్తిగా ఫోటోలతో నిండిపోయి వాట్సప్ బ్లాక్ కావడం జరిగింది తర్వాత దాని రెక్టిఫై చేసుకుని చూడడం జరిగింది.
ఇకపై వాట్సాప్ లో కాకుండా ఒక వెబ్సైట్ ద్వారా లేదా గూగుల్ ఫామ్ ద్వారా ఫోటోలు పంపే విధంగా రాబోయే కాలంలో( FA 3 )ఏర్పాటు చేస్తాను.
✏️ముఖ్యంగా గత సంవత్సరం ఐదు లక్షల డెభ్భై వేల 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది. ఒక ట్యాబ్ ఖరీదు 15వేల రూపాయలు అందులో నింపిన కంటెంట్ ఖరీదు 15 వేల రూపాయలు మొత్తంగా ఒక విద్యార్థికి చేసిన ఖర్చు 30000 రూపాయలు అంటే దాదాపు 1500 కోట్లు.
అదేవిధంగా ఈ సంవత్సరం చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు నాలుగు లక్షల మందికి ట్యాబ్లు అందజేస్తున్నాము వీటి ఖరీదు దాదాపు 1200 కోట్లు.
✏️ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పది తరగతులలో ప్రతి తరగతి గదిలో ఐఎఫ్బి (నాడు నేడు 2 కింద)ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నాం అంటే ఒక ఐఎఫ్బి ఖరీదు 1,40,000 దాదాపు 8 వేల కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది. ఇంత మొత్తం డబ్బులను డిజిటల్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కు ఏపీ గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది. ఈ మొత్తం డబ్బులు సరైన క్రమంలో వినియోగించబడాలంటే విద్యార్థులలో ఆ ట్యాబ్ లో ఉన్న కంటెంట్ ను చూసే విధంగా హ్యాబిట్ను అలవాటు చేయడం ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి.
జనవరి 23 నుంచి 29 వరకు ఎఫ్ఏ 3 పరీక్షలు నిర్వహించబడును. పరీక్షల్లో టాపర్స్ తో సెల్ఫీ తీసి ఫోటోలు నాకు పంపవలెను.
ముఖ్యంగా రాబోయే సంవత్సరం అనగా 2024 జనవరి మాసం నుంచి ఇప్పటివరకు ఏ విధంగా అయితే పాఠశాలలను సందర్శించాను ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించానో
అదే రీతిలో మండల విద్యాశాఖ కార్యాలయాలు డిప్యూటీ డిఈఓ కార్యాలయాలు& డీఈఓ కార్యాలయాలను సందర్శిస్తాను
కనుక ఈ 10 15 రోజుల్లో మీరు అందరూ మండల విద్యాశాఖ అధికారులు, డిప్యూటీ డిఈవోలు, డీఈవోలు సన్నద్ధం కావాలని తెలియజేస్తున్నాను
జనవరి మూడో వారం నుంచి మండల విద్యాశాఖ కార్యాలయాలను మరియు డిప్యూటీ కార్యాలయాలు డీఈఓ కార్యాలయాలను సందర్శిస్తాను.
ఏ విధంగా అయితే ఒక పాఠశాలలో రాండంగా ఒక యూనిట్ తీసుకుని ఆ పాఠం జరిగిందా లేదా ఆ పాఠానికి నోట్స్ పిల్లలు రాసారా లేదా అది కరెక్షన్ చేశారా లేదా అని చెక్ చేశానో దే రీతిలో మండల విద్యాశాఖ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు 9 ఫైళ్లను సెలెక్ట్ చేసుకుని చూస్తాను.
ఫైల్ అనేది ఒక పేపర్ కాదు అది ఒకరి జీవితం.
ఒక ఉపాధ్యాయుడు సెలవు సెటిల్మెంట్ చేయలేదు... లేదో అతనికి రావాల్సిన బెనిఫిట్ అందలేదు ఆ కారణంగా అతని మానసిక స్థితి వల్ల బోధనలో ఆ ప్రభావం పడుతుంది. ఫైనల్ గా ఆ ఎఫెక్ట్ అనేది పిల్లల చదువు పైన ఉంటుంది.
కాబట్టి అన్ని ఫైలు కూడా రెడీ చేసుకోవాలని సూచిస్తున్నాము.
అదేవిధంగా జూనియర్ కాలేజీలో కూడా విసిట్ ఉంటుందని తెలియజేస్తున్నాము.
చివరగా అందరూ ఉపాధ్యాయులకు ,టీచింగ్& నాన్ టీచింగ్ స్టాఫ్ కు విద్యాశాఖ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ ధన్యవాదాలు
No comments:
Post a Comment