కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET jan- 2024) పరీక్షకు సీబీఎస్‌ఈ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పరీక్ష డేట్ 21.1.24
లింక్
దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ (CBSE) నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET Exam-jan 2024)కు నోటిఫికేషన్ విడుదలైంది. 18వ ఎడిషన్ సీటెట్ పరీక్షను 2024 జనవరి 21న (ఆదివారం) నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 135 నగరాల్లో 20 భాషల్లో ఈ పరీక్ష జరగనుంది. CTET పరీక్షకు నవంబర్ 3 నుంచి 23వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు రుసుంను నవంబర్ 23న రాత్రి 11.59గంటల వరకు చెల్లించవచ్చని సీబీఎస్‌ఈ ఓ ప్రకటనలో పేర్కొంది. దరఖాస్తు రుసుం జనరల్/ఓబీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.1000; రెండు పేపర్లకు రూ.1200; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులైతే ఒక పేపర్‌కు రూ.500, రెండు పేపర్లకు రూ.600ల చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో సాధించిన స్కోరును కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు జీవిత కాల వ్యాలిడిటీ ఉంటుంది.
కొన్ని ముఖ్యమైన పాయింట్లు..
సీటెట్ ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. ప్రస్తుతం 18వ ఎడిషన్ సీటెట్‌కు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.
ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది.పేపర్-1ను ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునేవారు;పేపర్-2ను ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారు రాయొచ్చు.
పేపర్ -2 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఉంటుంది. పేపర్ -1 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.
No comments:
Post a Comment