APTF VIZAG: State Educatinal Achievement Survey INSTRUCTIONS

State Educatinal Achievement Survey INSTRUCTIONS

స్టేట్ ఎడ్యుకేషనల్ ఎచీవ్మెంట్ సర్వే నవంబర్ మూడవ (3rd November) తేదీన నిర్వహించడం జరుగుతుంది. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు.

👉 ఇది ఎంపిక చేయబడిన ప్రభుత్వ మరియు ప్రవేట్ యాజమాన్య పాఠశాలలలో నిర్వహిస్తారు.

👉 3వ తరగతి, 6వ తరగతి, 9వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తారు.

👉3వ తరగతి విద్యార్థులకు 3వ తరగతి సిలబస్ పైన, 6వ తరగతి విద్యార్థులకు 5వ తరగతి సిలబస్ పైన, 

9వ తరగతి విద్యార్థులకు 8వ తరగతి సిలబస్ పైన పరీక్ష నిర్వహిస్తారు.

👉ఈ SEAS పరీక్ష 3వ, 6వ, 9వ తరగతుల విద్యార్థులకు  మాథ్స్, మరియు లాంగ్వేజ్ నందు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.

పరీక్ష నిర్వహణ రెండు మీడియంలలో జరుగుతుంది.

ఇంగ్లీష్ మీడియం మ్యాప్ అయిన స్కూల్స్ కు ఇచ్చే SEAS పేపర్లో మాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. (3వ, 6వ మరియు 9వ తరగతుల విద్యార్థులకు)

తెలుగు మీడియంకు మ్యాప్ అయిన స్కూల్స్ కు ఇచ్చే SEAS పేపర్లో మాథ్స్, తెలుగు సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. (3 వ, 6వ మరియు 9వ తరగతుల విద్యార్థులకు)

👉3వ తరగతి విద్యార్థులకు 40 ప్రశ్నలు, 60 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది.  

👉 3 వ తరగతి విద్యార్థులకు ఇచ్చే SEAS పేపర్లో  

FLN మాథ్స్ నుండి 10 క్వశ్చన్స్,

FLN ఇంగ్లీష్/ తెలుగు నుండి 10 క్వశ్చన్స్ ఉంటాయి. 

మిగిలినవి 10 జనరల్ మాథ్స్ క్వశ్చన్స్, 

10 జనరల్ ఇంగ్లీష్/ తెలుగు క్వశ్చన్స్ ఉంటాయి.

👉 6వ తరగతి విద్యార్థులకు 50 ప్రశ్నలు,75 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది.

👉6 వ తరగతి విద్యార్థులకు ఇచ్చే SEAS పేపర్లో  

FLN మాథ్స్ నుండి 10 క్వశ్చన్స్,

FLN ఇంగ్లీష్/ తెలుగు నుండి 10 క్వశ్చన్స్ ఉంటాయి. 

మిగిలినవి 15 జనరల్ మాథ్స్ క్వశ్చన్స్ (5వ తరగతి పై), 

15 జనరల్ ఇంగ్లీష్/ తెలుగు క్వశ్చన్స్ (5వ తరగతి పై) ఉంటాయి.

👉 9వ తరగతి విద్యార్థులకు 60 ప్రశ్నలు, 90 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది.

👉 9 వ తరగతి విద్యార్థులకు ఇచ్చే SEAS పేపర్లో  

FLN మాథ్స్ నుండి 10 క్వశ్చన్స్,

FLN ఇంగ్లీష్/ తెలుగు నుండి 10 క్వశ్చన్స్ ఉంటాయి. 

మిగిలినవి 20 జనరల్ మాథ్స్ క్వశ్చన్స్(8వ తరగతి పై), 

20 జనరల్ ఇంగ్లీష్/ తెలుగు క్వశ్చన్స్ (8వ తరగతి పై) ఉంటాయి.

👉పరీక్షల నిర్వహణకు డిగ్రీ స్థాయి కోర్స్ లు చదువుతున్న విద్యార్థులను, డిఎడ్ చదువుతున్న విద్యార్థులు, ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు పేరుతో వినియోగించడం జరుగుతుంది.

👉ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు జిల్లా స్థాయిలో సమావేశం ఏర్పాటుచేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

👉డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేటర్ ఏర్పాటుచేసే శిక్షణా కార్యక్రమానికి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లందరూ తప్పనిసరిగా హాజరు కావాలి.

👉కేటాయించిన పాఠశాలల వివరాలు మండల లెవెల్ కోఆర్డినేటర్ నుండి పొందాలి.

👉ఇవ్వబడిన సూచనల ప్రకారం పరీక్షను నిర్వహించాలి.

👉పరీక్ష పూర్తైన పిదప ఓ ఎం ఆర్ పాకెట్స్ జాగ్రత్తగా సేకరించి మండల లెవెల్ కోఆర్డినేటర్ కు అప్పగించాలి.


👉ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు మూడు రకాలైన ప్రశ్నాపత్రాలు అంటే

 1) ప్యూపిల్స్ క్వచనైర్ (PQ),

 2) స్కూల్ క్వచనైర్ (SQ), 

 3) టీచర్ క్వచనైర్ (TQ) 

ఇవ్వడం జరుగుతుంది. 

👉 పూపిల్స్ క్వచనైర్ ను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు, 

స్కూల్ క్వచనైర్ ను ప్రధానోపాధ్యాయులకు,

టీచర్ క్వచనైర్ ను ఉపాధ్యాయులకు ఇచ్చి పూరించాలి.

👉ఓ ఎం ఆర్ షీట్స్ నందు సమాధానాలు గుర్తించవలసి ఉంటుంది.

👉మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 2 మండల / బ్లాక్ లెవెల్ కోఆర్డినేటర్ గా వ్యవహరించాలి.

👉చీఫ్ కంట్రోలింగ్ ఆఫీసర్ నుండి పరీక్ష నిర్వహణకు సంబంధించిన మెటీరియల్ సేకరించాలి. 

👉దానిని ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు సమర్ధవంతంగా పంపిణీచేయాలి.

👉పరీక్ష జరిగే సందర్భంలో సరైన పర్యవేక్షణ చేయాలి.

👉పరీక్ష పూర్తైన పిదప ప్యాకింగ్, కలెక్షన్, చీఫ్ కంట్రోలింగ్ ఆఫీసర్ కు  అందించడం వంటివి సమయానుసారం జరిగేటట్లు చర్యలు తీసుకోవాలి.

👉ప్రతి శనివారం అన్ని యాజమాన్య పాఠశాలలలో ప్రాక్టీస్ టెస్ట్ లు నిర్వహించినట్లైతే విద్యార్థులు సులువుగా పరీక్ష రాయగలుగుతారు. కనుక ప్రాక్టీస్ చేయించాలి.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today