సాల్ట్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ టీచర్లకు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోర్సులు లో ప్రత్యేక శిక్షణ. ఫిర్కి యాప్లో ఆన్లైన్ కోర్సు కంటెంట్ . నవంబర్ 30 లోగా టీచర్లు కోర్సులు పూర్తి చేయాలి అని సమగ్ర శిక్ష ఉత్తర్వులు జారీ.
FIRKI mobile App Link
https://play.google.com/store/apps/details?id=org.firki.mobile
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠ శాలల ఉపాధ్యాయులకు టీచర్ ప్రొఫెషనల్ డెవల పె మెంట్ కోర్సుల నిర్వహణకు సమగ్ర శిక్ష అధికా రులు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠ శాలల్లో అభ్యాస ఫలితాలు, బోధన పద్ధతుల్లో నాణ్యత పెంపే లక్ష్యంగా చేపట్టిన సపోర్టింగ్ ఆం ధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ (సాల్ట్) కార్యక్రమం లో భాగంగా ఈ కోర్సులు నిర్వహిస్తున్నారు. 3 నుంచి 10వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యాలను పెంపొందించేలా ఈ కోర్సులు ఉంటాయి. వీటిని బ్లెండెడ్ మోడల్ విధానంలో టీచర్లకు అందిస్తారు. ఆన్లైన్ శిక్షణలో భాగంగా వీడియోలు, రీడింగ్ మెటీరియల్, పలు రకాల టెస్టులు వీటిలో ఉంటాయి. ఈ ఆన్లైన్ కోర్సులు 'ఫిర్కి' అనే ఉపాధ్యాయ శిక్షణ వేదిక యాప్ ద్వారా చేపడతారు. కోర్సులో నమోదైన ఉపాధ్యాయులు నిర్ణీత సమయంలో ఒక మాడ్యూ ల్ను పూర్తి చేసిన తరువాత స్కూల్ కాంప్లెక్సు సమావేశాల్లో నిర్వహించే పీర్ లెర్నింగ్ సర్కిళ్ల ద్వారా ఆఫ్లైన్ శిక్షణ అందిస్తారు. టీచర్లందరూ నవంబరు 30వ తేదీలోగా ఈ కోర్సులు పూర్తిచే సేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల విద్యా శాఖాధికారులకు సమగ్ర శిక్ష ఆదేశించింది. టీచర్లు శిక్షణ యాప్ ఫిర్కిని డౌన్లోడ్ చేసుకొనేలా చూడాలని సూచించింది. ఎస్సీఈఆర్టీ ఇప్పటికే 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్, సైన్సు, సోషల్ సైన్సు, గణితం ఉపాధ్యా యుల కోసం ప్రత్యేకంగా 'డెవలపింగ్ ఇంగ్లీష్ పెడగోగి' పేరుతో మొదటి కోర్సును చేపట్టింది. ఈ కోర్సు మూడు మాడ్యూళ్లలో ఉంది. నెలకొకటి చొప్పున ఈ మాడ్యూళ్లను అందిస్తున్నారు.
ఉపాధ్యాయులకు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోర్సులు..
No comments:
Post a Comment