APTF VIZAG: HM లాగిన్ లో UDISE + లో 2022-23 అకడమిక్ ఇయర్ Student Profile పూర్తి చేయు విధానం

HM లాగిన్ లో UDISE + లో 2022-23 అకడమిక్ ఇయర్ Student Profile పూర్తి చేయు విధానం

గుర్తుంచుకోండి:

మనం చేయుచున్నది 2022-23 విద్యా సంవత్సరం డేటా

విద్యార్థులు వివరాలు డిపార్ట్మెంట్ వారే prefilled గా అన్నీ ఇచ్చేశారు

మనం తప్పులుంటే సరి చేయడమే

ఏ సందేహం ఉన్నా మన మండల MIS Coordinator లేదా Data entry ఆపరేటర్ ని అడగాలి.

ఈ వివరాలు కేంద్ర యూడైస్ వారు map చేస్తారు

ఈ ఒక్క సంవత్సరం మాత్రమే అప్డేట్ చేయాలి.ఇహ ప్రతి సంవత్సరం ఆటోమేటిక్ గా వస్తాయి

ప్రతి కేంద్ర/రాష్ట్ర ప్రాయోజిత పథకానికీ ఈ డేటా నే ప్రామాణికంగా తీసుకొంటారు

CWSN మరియు వొకేషనల్ విద్యార్థులకు కూడా ఇది తప్పక పూర్తి చేయాలి

1. UDISE PLUS వెబ్‌సైట్ లోకి వెళ్ళాలి.

వెబ్‌సైట్ అడ్రసు:

https://sdms.udiseplus.gov.in


2.Login for all modules అనే లింకు నొక్కాలి


3.Student module కింద "ఆంధ్ర ప్రదేశ్" అని సెలక్షన్ చేసుకొని Go పై క్లిక్ చేయాలి.


4.Login for student management services అనే లింకు పై నొక్కాలి.


5. UDISE CODE ,Passwordమరియు captcha code ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి.


6. పాఠశాల బేసిక్ వివరాలు చూపుతూ ఒక విండో వస్తుంది. Close పై నొక్కండి.


7. ఇప్పుడు తరగతి సెక్షన్ వారీగా ఒక విండో వస్తుంది.


8. ఒక తరగతి కి చెందిన ఒక సెక్షన్ పై..view/manage అనే లింక్ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు ఈ తరగతిలో విద్యార్థుల పేర్లు తో ఒక విండో ఓపెన్ అవుతుంది.


ప్రతి విద్యార్థి ఎదురుగా రెడ్ కలర్ లో Not Started అని కనిపిస్తుంది.

దాని పక్కనె

EP-Enrollment Profile

GP-General profile

SF-Special Facilities


అనే మూడు విభాగాలు పూర్తి చేయవలసి ఉంటుంది.


9. ఇప్పుడు GP/EP/SFలలో ఒక్క దానిని సెలక్షన్ చేసుకొనండి


10. విద్యార్థి యొక్క సాధారణ వివరాలు వస్తాయి.

ప్రతి ఫీల్డ్( బాక్స్) ని చదివి...ఏమయినా మార్పులు చేర్పులు ఉంటే చేసి కిందన ఉన్న Update అనే బటన్ నొక్కితే ఈ విభాగం అప్డేట్ అవుతుంది.

Next పై నొక్కితే మరొక విభాగం సెలక్షన్ కి వస్తుంది.

11. ఇప్పుడు రెండవ విభాగాన్ని ఎంచుకొని పూర్తి చేశాక,మూడవ విభాగాన్ని కూడా పూర్తి చేయండి.

12. దీనితో ఆ విద్యార్థి GP,EPమరియు SF లు పూర్తి అయ్యి అతని ప్రొపైల్ గ్రీన్ కలర్ లోకి మారుతుంది.

13. తదుపరి మరొక విద్యార్థి ని ఎంచుకొనుట ద్వారా ఆ తరగతి మొత్తం అప్డేట్ చేయండి.

14. ఇప్పుడు మొదట చెప్పిన విండోలో ఆ తరగతి గ్రీన్ కలర్ కి మారిపోతుంది.

15. ఇదే మాదిరిగా మిగిలిన సెక్షన్ లు,తరగతులు పూర్తి చేయవలసినది.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today