ప్రభుత్వోద్యోగుల పెన్షన్ విధానంపై సమీక్ష. ఆర్థిక కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అమలు చేస్తున్న పెన్షన్ విధానంపై సమీక్షకు గురువారం కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టి.వి.సోమనా థన్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం కార్యదర్శి, వ్యయ విభాగం ప్రత్యేక కార్యదర్శి, పీఎస్ఆర్డీఏ చైర్మన్లు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మెమొరాండం జారీ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నూతన పెన్షన్ విధానాన్ని సమీక్షించి ఏమైనా సవరణలు చేయాల్సి ఉందా, లేదా అన్నదానిపై కమిటీ సూచనలు ఇస్తుంది. బడ్జెట్పై ఆర్థిక ప్రభావం, సామాన్యుల ఆర్థిక ప్రయోజనాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని సిఫార్సులు చేస్తుంది. అయితే నివేదిక సమ రణకు ఎలాంటి గడువును విధించలేదు. బీజేపీయేతర పార్టీల పాల నలో ఉన్న రాష్ట్రాలు పాత పెన్షన్ విధానానికి మళ్లుతుండడంతో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకొంది.
No comments:
Post a Comment