APTF VIZAG: ఉపాధ్యాయుల బదిలీలకు కొత్త చట్టం. డీఎస్సీ కోసం ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం: మంత్రి బొత్స

ఉపాధ్యాయుల బదిలీలకు కొత్త చట్టం. డీఎస్సీ కోసం ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం: మంత్రి బొత్స

 ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారా యణ పేర్కొన్నారు. కర్ణాటక, కేరళ, ఇతర రాష్ట్రాల్లోని చట్టాలను అధ్య యనం చేసి.. కొత్త చట్టం తీసుకొస్తామని వెల్లడించారు. ఈ చట్టం అమ ల్లోకి వస్తే ఏటా వేసవి సెలవుల్లోనే పారదర్శకంగా బదిలీలు నిర్వహించే అవ కాశం ఉంటుందని స్పష్టం చేశారు. విజయవాడలో శుక్రవారం ఆయన విలే కరులతో మాట్లాడుతూ.. "ఈ ఏడాది వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించాలని భావిస్తున్నాం. ఇంటర్మీడియట్ జూనియర్ లెక్చరర్లకు వేసవి సెలవుల్లో బదిలీలు నిర్వహించేందుకు రెగ్యులర్, ఒప్పంద లెక్చరర్ల సంఘా లతో చర్చించాం. అయిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హు లవుతారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి కసరత్తు కొన సాగుతుంది. డీఎస్సీ-98 పోస్టుల భర్తీలో రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవ సరం లేదు. మొదటి విడతలో భర్తీకాని పోస్టులు 200వరకు ఉన్నాయి. వాటిని ఆ తర్వాత మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేస్తాం" అని వెల్లడించారు.

అప్పుడు లేని ఖాళీలు.. ఇప్పుడెక్కడ వస్తాయి?

రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ ఖాళీలు 717 మాత్రమే ఉన్నాయని శాసన మండలిలో చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పుడు మెగా డీఎస్సీ వేస్తామంటూ ప్రకటించారు. అప్పటి వరకు ఉన్న ఖాళీలనే చెప్పామని, సందర్భనుసారం అవి మారుతుంటాయని వెల్లడించారు. "త్వరలో ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ వేస్తాం. క్షేత్రస్థాయి నుంచి వివరాలను సేకరిస్తున్నాం. అందరి అంచనాలకు మించే పోస్టులు భర్తీ చేస్తాం. విశ్వవిద్యాలయాలు సహాయ ఆచార్యులు, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టులు భర్తీ చేస్తాం" అని మంత్రి వెల్లడించారు. ఆర్థిక సమస్య కారణంగా వసతి దీవెన వాయిదా వేశాంగానీ మొత్తంగా రద్దు చేయలేదు కదా? అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

No comments:

Post a Comment