APTF VIZAG: Union budget 2023-24 announced by finance minister

Union budget 2023-24 announced by finance minister


వేతనజీవులు, మధ్యతరగతివర్గాలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆశ ఫలించింది. వ్యక్తిగత ఆదాయ పన్నుమినహాయింపు కనిష్ఠ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతూ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను విధించనున్నారు. రూ.7 - రూ.9 లక్షల వరకు 5 శాతం పన్ను, ఆదాయం రూ.30 లక్షలు దాటితే 30 శాతం పన్ను విధింపునకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అయితే ఇది నూతన పన్ను విధానానికి మాత్రమే వర్తిస్తుంది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలనేది పూర్తిగా చెల్లింపుదారుడి ఐచ్ఛికం. ఎందులో ప్రయోజనం ఉంటుందనుకుంటే దానిని ఎంపిక చేసుకోవచ్చు. కాగా పన్ను మినహాయింపులకు సంబంధించి ఆర్థిక నిపుణుల అంచనాలు దాదాపు నిజమయ్యాయి. రెండేళ్లక్రితం ప్రవేశపెట్టిన నూతన పన్ను విధానంలో వేతన జీవులకు ఆకర్షించడమే లక్ష్యంగా స్లాబుల్లో మార్పులు జరగొచ్చునని మొదటి నుంచి విశ్లేషకులు చెబుతూ వచ్చారు. దాదాపు ఇప్పుడు అదే జరిగింది.


వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు.కొత్త విధానంలో పొదుపు మొత్తాలపై రిబేట్ రూ 7.00 లక్షలకు పెంపు.


స్టాండర్డ్ డిడక్షన్ రూ 3.00 లక్షలు


6 స్లాబుల్లో టాక్స్


0 నుంచి రూ. 3 లక్షలు - సున్నా


రూ. 3 లక్షలు నుంచి రూ.6 లక్షలు - 5 %


రూ. 6 లక్షలు నుంచి రూ.9 లక్షలు - 10%


రూ. 9 లక్షల నుంచి రూ.12 లక్షలు - 15%


రూ. 12 లక్షల నుంచి రూ.15 లక్షలు - 20%


రూ. 15 లక్షల పైబడిన ఆదాయం - 30%

ఇన్కంటాక్స్ (వచ్చే సంవత్సరానికి)మినహాయింపు రూ 5.00 లక్షలు యదాతథం.ఎటువంటి మార్పు లేదు

బడ్జెట్ విశేషాలు.


రైతులకు 20 లక్షల కోట్ల రుణాలు


మత్స్య కారులకి 6000 కోట్ల సహకారం


157 నర్సింగ్ కాలేజీలు


చిరు ధాన్యాల వ్యాపారానికి...వ్యవసాయానికి సహకారం


వ్యవసాయ పరపతి సంఘాలకు 2000 కోట్లు


Ekalavya పాఠశాలలకు 38 వేల మంది ఉపాధ్యాయుల నియామకం.


తెల్ల కార్డు దారులకు ఉచిత బియ్యం పంపిణీ ఈ సంవత్సరం కూడా కొనసాగింపు.

 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 


ఆదాయపన్ను పరిమితి రూ.7లక్షలకు పెంపు

ఉద్యోగులకు ఊరటనిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు.

ప్రస్తుతం ఉన్న రూ.5లక్షల ఆదాయపు పన్ను పరిమితిని రూ.7లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.


వైద్య కళాశాలల్లో మరిన్ని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తాం. 

అధ్యాపకుల శిక్షణకు డిజిటల్‌ విద్యావిధానం, జాతీయ డిజిటల్‌ లైబ్రరీ తీసుకొస్తాం 


దేశవ్యాప్తంగా మెడికల్‌ కళాశాలలతో పాటు, 157 నర్సింగ్‌ కాలేజ్‌లకు అనుమతి 

త్వరలోనే ఐసీఎంఆర్‌ ప్రయోగశాలల విస్తృతిని మరింత పెంచుతాం.

 ఫార్మారంగంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తాం.

ఈ-కోర్టులకు రూ.7వేల కోట్లు 

బ్యాటరీల నిల్వ కేంద్రాల్లో 4వేల మెగావాట్లు.

పట్టణ మౌలిక సౌకర్యాలకు రూ.10వేల కోట్ల నిధి.

2030 కల్లా 5 MMT హైడ్రోజన్‌ తయారీ.


తాజా బడ్జెట్‌లో రైల్వేలకు రికార్డు స్థాయిలో నిధులు కేటాయింపు చేస్తున్నాం

రైల్వేల అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో రూ.2.40లక్షల కోట్లు కేటాయిస్తున్నాం.

రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు

రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7లక్షల కోట్లు.

కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75వేల కోట్లు.

బడ్జెట్‌లో మూలధన వ్యయానికి రూ.13.5లక్షల కోట్ల కేటాయింపు.

కోస్టల్‌ షిప్పింగ్‌కు ప్రోత్సాహం 

కాలుష్య కారక వాహనాల తొలగింపులో భాగంగా వాహన తుక్కు విధానం.


పీఎం కౌశల్‌ యోజనలో భాగంగా యువతకు శిక్షణ.

ప్రకృతి వ్యవసాయం చేసేందుకు వీలుగా కోటిమంది రైతులకు సాయం.

36 అంతర్జాతీయ స్థాయి నైపుణ్య కేంద్రాల ఏర్పాటు


కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్ద పీట వేస్తాం. 

అలాగే మౌలిక వసతుల అభివృద్ధికి 33శాతం అధికంగా నిధులు కేటాయిస్తున్నాం


ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు చేరువ చేసేందుకు చర్యలు:ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 

ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమం. 

ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కోసం రూ.15వేల కోట్లు.


ఏకలవ్య పాఠశాలల్లో భారీ ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపడతాము 

డిజిటల్‌ ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటు చేస్తాం.

కారాగాగాల్లో మగ్గిపోతున్న పేద ఖైదీలకు ఆర్థిక చేయూత అందిస్తాం


దేశంలో 50 టూరిస్ట్‌ స్పాట్‌ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు

దేఖో ఆప్నా దేఖ్‌ పథకం ప్రారంభం

స్వదేశీ ఉత్పత్తుల అమ్మకానికి దేశవ్యాప్తంగా యూనిటీ మాల్స్‌


దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్ట్‌లు, హెలిప్యాడ్‌ల నిర్మాణం 

5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌ల ఏర్పాటు

పీఎం కౌశల్‌ పథకం కింద 4లక్షల మందికి శిక్షణ


మహిళల కోసం కొత్త స్కీమ్‌


ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ను ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్‌ చేయొచ్చు.


గృహ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.

కొత్తగా ఇల్లు కొనుగోలు, కట్టుకోవాలనుకోవాలనుకునే వారికి మోదీ సర్కారు గుడ్‌న్యూస్‌ చెప్పింది. పీఎం ఆవాస్‌ యోజన పథకానికి ఈ సారి బడ్జెట్‌లో నిధులు పెంచింది. గత బడ్జెట్‌లో పీఎం ఆవాస్‌ యోజనకు 48 వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79వేల కోట్లు కేటాయించారు. వడ్డీ రేట్లు పెరిగిన వేళ గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట కల్పించే అంశం.

No comments:

Post a Comment