APTF VIZAG: విద్యార్థుల ఖాతాల్లోకి నేడు నగదు జమ. విదేశీవిద్యా దీవెన కింద వేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

విద్యార్థుల ఖాతాల్లోకి నేడు నగదు జమ. విదేశీవిద్యా దీవెన కింద వేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యాకోర్సులు అభ్యసించే విద్యార్థుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నగదు జమచేయనుంది. క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 200 విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడత సాయంగా రూ. 19.95 కోట్లు వారి ఖాతాల్లో జమచేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన ఎస్సి, ఎస్సీ, బిసి, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు, ఇతర విద్యార్థులకు గరిష్టంగా రూ.కోటి వరకు 100 శాతం ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంటు ప్రభుత్వం అందిస్తుంది. 100 నుంచి 200 ర్యాంకులు పొందిన యూనివర్సిటీల్లో ఎంపికైన ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ విద్యార్థులకు 100 శాతం ట్యూషన్ ఫీజు, గరిష్టంగా రూ.75 లక్షల వరకు అందించనుంది. ఇతర విద్యార్థులకు గరిష్టంగా రూ.50 లక్షలు లేదా ట్యూషన్ ఫీజులో 50 శాతం, ఏది తక్కువైతే అది చెల్లిస్తుంది. విద్యార్థులకు విమాన, వీసా ఛార్జీలను ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుంది.

No comments:

Post a Comment