APTF VIZAG: 10 వేల లోపు పెన్షన్ ఉంటే రేషన్ కార్డు. రిటైర్డు ఉద్యోగులకు అవకాశమిచ్చిన ప్రభుత్వం

10 వేల లోపు పెన్షన్ ఉంటే రేషన్ కార్డు. రిటైర్డు ఉద్యోగులకు అవకాశమిచ్చిన ప్రభుత్వం

రిటైర్డు ఉద్యోగులు రూ.10 వేలలోపు పెన్షన్ పొందే వారు రేషన్ కార్డు తీసుకునేందుకు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి హెచ్ అరుణ్ కుమార్ బుధవారం సర్క్యులర్ జారీ చేశారు.రేషన్ కార్డు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆరెంచల నిబంధనల్లో గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం రూ.10 వేలలోపు,పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలలోపు కలిగి ఉండాలి. ప్రస్తుతం సిఎఫ్ఎంఎస్ నుంచి వేతనాలు పొందుతున్న ప్రభుత్వ పెన్షనర్లకు ఆదాయంతో సంబంధం లేకుండా రేషన్ కార్డును పౌరసరఫరాలశాఖ తిరస్కరిస్తుంది. ఇప్పుడు పెన్షన్ రూ.10 వేలలోపు పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది.ఇప్పుడు రూ.10 వేలలోపు పెన్షన్ పొందే వారికి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతివ్వడం వల్ల 19,780 మంది కొత్త రేషన్ కార్డులు పొందేందుకు అర్హత సాధించారు.

No comments:

Post a Comment

Featured post

IMMS app updated latest version 1.6.8