APTF VIZAG: ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం (08–02–2023) సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం (08–02–2023) సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం (08–02–2023)  సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను అమరావతి సచివాలయం పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులకు వివరించిన  రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, బి.సి.సంక్షేమం మరియు సినిమాటోగ్రపీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ

ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమ కార్యక్రమాలు.

                                                                                                                                                                            # ఫిబ్రవరి 10న వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా అమలు.

వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా.

బాలికా విద్యకు ప్రోత్సాహాన్నిచ్చే గొప్ప సంస్కరణ కార్యక్రమం వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా.

వధూ, వరులు కచ్చితంగా పదోతరగతి పాసవ్వాలన్న నిబంధనను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం.

గతంలో పోలిస్తే దాదాపు రెట్టింపు లబ్ధి.

4,536 కుటుంబాలకు మేలు జరిగేలా రూ.38.18 కోట్లు లబ్ధి.

అక్టోబరు నుంచి డిసెంబరు వరకూ వివాహం చేసుకున్నవాళ్లకు సంబంధించి.. జనవరిలో తనిఖీ చేసి ఫిబ్రవరిలో చెల్లించనున్న ప్రభుత్వం.

జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో వివాహం చేసుకున్నవాళ్లకు ఏప్రిల్‌ నెలలో తనిఖీ చేసి మే నెలలో చెల్లింపు. 

ప్రతి మూడు నెలలకొకమారు చెల్లించనున్న ప్రభుత్వం.

వైఎస్‌ఆర్‌ లా నేస్తం.

# ఫిబ్రవరి 17న అందించనున్న వైఎస్‌ఆర్‌ లా నేస్తం.

వైఎస్‌ఆర్‌ లా నేస్తం కింద 65,537 వేల మంది జూనియర్‌ న్యాయవాదులకు మూడేళ్లలో రూ.35 కోట్లు  స్టైఫండ్‌ కింద అందించిన ప్రభుత్వం.

న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు.

17 వేల మందికి మేలు చేస్తూ ఇప్పటివరకూ రూ.25 కోట్ల కార్ఫస్‌ ఫండ్‌ కింద అందించిన ప్రభుత్వం.

# కర్నూలులో 50 ఎకరాల స్ధలంలో రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం(ఎన్‌ఎల్‌యూ) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.

# ఫిబ్రవరి 24న రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ  చెల్లించనున్న ప్రభుత్వం.

ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి సంబంధించిన పరిహారాన్ని అదే సీజన్‌లో చెల్లిస్తున్న ప్రభుత్వం.

# ఫిబ్రవరి 28న జగనన్న విద్యాదీవెన పూర్తి పీజు రీయింబర్స్‌మెంట్‌.

అక్టోబరు నుంచి డిసెంబరు క్వార్టర్‌కు సంబంధించి ఫిబ్రవరి 28న విద్యాదీవెన విద్యార్ధులకు అందజేత.

విద్యాదీవెనకి సంబంధించి ఈ త్రైమాసికానికి దాదాపు రూ.700 కోట్లు. 

దాదాపు 10.50 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి.

# ఉగాది సందర్భంగా మూడో విడత వైఎస్‌ఆర్‌ ఆసరా.

వారం రోజుల పాటు పండగ వాతావరణంలో పంపిణీ కార్యక్రమం. 

79 లక్షల మంది మహిళలకు మేలు చేస్తూ మూడో విడతగా దాదాపు రూ.6,500 కోట్లుపంపిణీ. 

10–04–2019 నాటికి డ్వాక్రా మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలు రూ.25వేలు కోట్లు చెల్లిస్తానని పాదయాత్రలో ప్రకటించిన శ్రీ వైయస్‌.జగన్‌.

ఇప్పటికే దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా చెల్లించిన వైయస్‌.జగన్‌ ప్రభుత్వం.

# మార్చినెలలో ఈబీసీ నేస్తం.

ఈబీసీ నేస్తం పథకం కింది దాదాపు రూ.600 కోట్లతో 4 లక్షల మందికి లబ్ధి.

# మార్చి నెలలో వసతి దీవెన.

వసతి దీవెన కింద ఈ ఏడాదికి సంబంధించి దాదాపు 10.50 లక్షల మంది విద్యార్దులకు మేలు చేస్తూ.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ రూ.20వేల వరకూ లబ్ధి. 

విద్యార్ధుల వసతి, భోజన ఖర్చుల కోసం దాదాపు రూ.1000 కోట్లు అందించనున్న ప్రభుత్వం.

# కర్నూలు జిల్లా డోన్‌లో నూతనంగా నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 31 మంది బోధన, 12 మంది బోధనేతర సిబ్బంది భర్తీకి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.

# ఎన్టీఆర్‌ జిల్లా నందిగాంలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను రూ.34.48 కోట్ల వ్యయంతో 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌ గ్రేడ్‌ చేయాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.

52 అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.

# వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖలో ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేసి రాష్ట్ర, జోనల్, జిల్లా స్ధాయిలో పోస్టుల భర్తీ చేయాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.

ఖాళీ అయిన వెంటనే ఎప్పటికప్పుడు వైద్య విభాగంలో పోస్టుల భర్తీ కోసం మెడికల్‌ సర్వీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు.

గత ప్రభుత్వంలో ఖాలీగా ఉన్నవి, మన ప్రభుత్వంలో కొత్తగా సృష్టించిన పోస్టులు కలిపి దాదాపు 49 వేల పోస్టుల భర్తీ.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌.

ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యుల నియామకం. ఒక 104 వాహనం.

ఒక వైద్యుడు పీహెచ్‌లో ఉంటే, మరో వైద్యుడు గ్రామాల్లో ఇళ్లకు వెళ్తారు.

ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని పటిష్టంగా అమలు చేయడానికి వీలుగా వైద్య ఆరోగ్యశాఖలో ప్రతి పీహెచ్‌సీలో సిబ్బందిని 12 నుంచి 14 మందికి పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.

ఇందులో భాగంగా కొత్తగా 1,610 కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం.

# వైయస్సార్‌ జిల్లా ఫాతిమా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో 2015–16లో కేటగిరీ ఏ తో పాటు, తర్వాత విద్యాసంత్సరాలకు సంబంధించి కేటగిరీ బీ, సీలకు చెందిన విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు అంశాన్ని స్పెషల్‌ కేసుగా పరిగణించి చెల్లించాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం.

రూ.9,12,07,782 చెల్లించాలన్న నిర్ణయానికి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.

# డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టులో జిల్లా సమన్వయకర్తలుగా 10 అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం.

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లను ఫారిన్‌ సర్వీసు డిప్యూటేషన్‌ (ఎఫ్‌ఎస్‌డి)పై నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం.

# 1998 డీఎస్సీలో క్వాలిఫైడ్‌ అభ్యర్ధులతో 4,534 సెకండరీ గ్రేడ్‌ టీచర్ల పోస్టుల భర్తీ. 

డిఎస్సీ –1998 క్వాలిఫైడ్‌ అభ్యర్ధులతో కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం.

వీరికి మినిమమ్‌ టైం స్కేల్‌(ఎంటీఎస్‌) వర్తింపుచేయాలన్న ప్రతిపాదనకూ మంత్రిమండలి ఆమోదం.

ప్రాధమిక విద్యాశాఖతో పాటు ఖాళీలను అనుసరించి బీసీ, సోషల్‌ వెల్పేర్‌ స్కూళ్లలోనూ భర్తీ చే యడానికి గ్రీన్‌ సిగ్నల్‌.

# మార్చి 2వ తేదీ నుంచి మిడ్‌ డే మీల్స్‌లో రాగిజావ.

మధ్యాహ్న భోజన పథకం మెనూలో కొత్తగా అమల్లోకి రానున్న రాగిజావ.

వారానికి మూడు రోజుల పాటు రాగిజావ.

పిల్లలకు ఐరన్, కాల్షియం లోపాలు లేకుండా నివారించడానికి రాగిజావ.

మార్చి 2 వ తేదీ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం.

# మూడో తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్ల కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్న ప్రభుత్వం.

సబ్జెక్టు టీచర్లగా అర్హత పొందిన 5,809 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు నెలకు రూ.2500 చొప్పున సబ్జెక్ట్‌ టీచర్‌ అలవెన్స్‌ ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌. 

డిజిటల్‌ విద్యావిధానం వైపు వేగంగా అడుగులు వేస్తూ ఇప్పటికే నాడు నేడు ద్వారా అభివృద్ధి చెందిన పాఠశాలల్లో 6వతరగతి పైన ఉన్న అన్ని తరగతులకు సంబంధించి ప్రతి తరగతి గతిలో ఒక ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్లానెల్‌ (ఐఎఫ్‌పీ)లు చొప్పున 30,213 ఐఎఫ్‌పీలు ఏర్పాటు. మిగిలిన తరగతి గదుల్లో స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు.

# కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి ప్రస్తుతం అందిస్తున్న గౌరవవేతానానికి అదనంగా 23 శాతం పెంచుతూ ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం.

అదే విధంగా కస్తూరిబా విద్యాలయాల్లో పనిచేస్తున్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లకు కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ టీచర్లు(సీఆర్టీలు)తో సమానంగా గౌరవ వేతనం ఇవ్వాలన్న ప్రతిపాదనకూ గ్రీన్‌ సిగ్నల్‌.

# విశాఖపట్నంలో 100 మెగావాట్ల డేటా సెంటర్, ఐటీ అండ్‌ బిజినెస్‌ పార్కు, స్కిల్‌ సెంటర్‌తో పాటు రిక్రియేషన్‌ సెంటర్ల ఏర్పాటు కోసం అవసరమైన 60.29 ఎకరాల భూమి వైజాగ్‌ టెక్‌ పార్కు లిమిటెడ్‌ (వీటీపీఎల్‌)కు కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.

వైజాగ్‌ టెక్‌ పార్కు ఏర్పాటు ద్వారా 14,825 మందికి కలగనున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.

# రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం నిర్వహణలో ఉన్న డిగ్రీ కళాశాలకు సంబంధించి 10 ప్రిన్సిపాల్, 138 బోధనా సిబ్బంది, 36 నాన్‌ టీచింగ్‌ పోస్టులను అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.

# ఏపీ జువైనల్‌ వెల్పేర్‌ డిపార్ట్‌మెంట్, విజయవాడలో డైరెక్టర్‌ పోస్టు భర్తీకి కేబినెట్‌ ఆమోదం.

# ఆంధ్రప్రదేశ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌లో 29 అదనపు పోస్టుల ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.

# గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పీవీ సింధు బ్యాడ్మెంటెన్‌ అకాడమీ అండ్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌కు వేకెంట్‌ ల్యాండ్‌ టాక్స్‌ను రద్దు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం.  

# ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాల్టీస్‌ యాక్టు –1965, ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్స్‌ యాక్టు – 1955లకు సవరణలకు సంబంధించిన డ్రాప్ట్‌ బిల్లుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.

సర్వే సెటిల్మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ మరియు రెవెన్యూశాఖల సహాయంతో అర్భన్‌ లోకల్‌ బాడీస్‌ (యూఎల్‌బీస్‌)లో సమగ్ర భూముల రీ సర్వే పనుల కోసం అవసరమైన సవరణలకు కేబినెట్‌ ఆమోదం.

# ఏపీ మున్సిపల్‌ అకౌంట్స్‌ సబార్డినేట్‌ సర్వీసెస్‌ కింద పరిపాలనా సౌలభ్యం కోసం డిప్యూటీ డైరెక్టర్‌ (అకౌంట్స్‌) పోస్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.

# ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటుకు అవసరమైన భూమిని 20 సంవత్సరాల లీజు పీరియడ్‌కు కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం.

16 అర్బన్‌  లోకల్‌ బాడీస్‌ (ఒంగోలు, నెల్లిమర్ల, పాలకొండ, శ్రీకాకుళం, వినుకొండ, అనంతపురం, ప్రొద్దుటూరు, కావలి, పిఠాపురం, రాయచోటి, గూడూరు, పెద్దాపురం, కడప, బద్వేలు, వెంకటగిరి, చిలకలూరిపేట)లలో చదరపు మీటరుకు ఏడాదికి రూ.1 కే అద్దె ప్రాతిపదికన కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఓకే.

# నెల్లూరు బ్యారేజ్‌ను నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరు బ్యారేజ్‌గా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం.

# రాష్ట్రంలోని గ్రానైట్‌ పరిశ్రమలు పూర్వవైభవం దిశగా పయనించేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు కేబినెట్‌ ఆమోదం.

స్మాల్‌ స్కేల్‌ గ్రానైట్‌ పరిశ్రమలకు విద్యుత్తును యూనిట్‌ రూ.2 కే అందించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.


# ఆంధ్రప్రదేశ్‌ హైడ్రో ప్రాజెక్టు ప్రమోషన్‌ పాలసీ –2022లోని ప్రొవిజన్‌ 3 ప్రకారం ... వివిధ పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో ప్రాజెక్టు సంస్ధలకు అవసరమైన అనుమతులు మంజూరుకు కేబినెట్‌ ఆమోదం.

# ఎకోరన్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌ సంస్ధకు సుమారు 1000 మెగావాట్ల విండ్‌పవర్, 1000 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అనుమతులకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.

కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో దశలవారీగా నిర్మాణం కానున్న విండ్, సోలార్‌ ప్రాజెక్టులు.

విండ్‌ పవర్‌ ప్రాజెక్టులు.

అనంతపురం జిల్లా రాళ్ల అనంతపురంలో 250, కర్నూలు జిల్లా బేతంచర్లలో 118.8 మెగావాట్స్, అనంతపురం జిల్లా కురుబరాహల్లిలో 251.2 మెగావాట్స్, కర్నూలు జిల్లా చిన్న కొలుములపల్లిలో 251.2 మెగావాట్స్, కర్నూలు జిల్లా మెట్టుపల్లిలో 100 మెగావాట్స్, జలదుర్గంలో 130 మెగావాట్లు విండ్‌ ప్రాజెక్టులు ఏర్పాటు.

సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులు.

అనంతపురం జిల్లా కమలపాడు, యాడికిలలో 250 మెగావాట్లు, శ్రీ సత్యసాయి జిల్లా కొండాపురంలో 250 మెగావాట్లు, నంద్యాల జిల్లా నొస్సంలో 500 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటు.


# మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రుణసదుపాయం కోసం అవసరమైన రూ.3,940.42 కోట్ల బ్యాంకు గ్యారంటీకై పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు, మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు మధ్య కుదిరిన ఎంఓయూను రాటీఫై చేస్తూ కేబినెట్‌ ఆమోదం.

# పెట్టుబడులు, మౌలికసదుపాయాలు కల్పనశాఖలో ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ విభాగానికి చీప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) పోస్టు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం.

# రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్‌ బెర్తుల నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు 250 ఎకరాల భూమిని లీజు ప్రాదిపదికన కేటాయించే ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం.

దీనివల్ల రామాయపట్నం ప్రాంతంలో మెరుగుపడనున్న ఉపాధి అవకాశాలు.

# స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు(ఎస్‌ఐపీబీ)లో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం.

రూ.1.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు. దీని ద్వారా 70 వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. పరోక్షంగా మరింతమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు.

# ఏపీ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీలో వివిధ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం.

ఏపీ లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీలో రెండు పోస్టులు (1 డేటా ప్రాసెసింగ్‌ ఆఫీసర్, 1 డేటా ఎంట్రీ ఆపరేటర్‌) తో పాటు 13 జిల్లాల్లో 13 డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం.


# ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ మరియు డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీస్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌లో 14 ఫ్రంట్‌ ఆఫీస్‌ కోఆర్డినేటర్ల భర్తీకి కేబినెట్‌ ఆమోదం.

# విజయనగరంలో అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం.

#లీగల్‌ సర్వీసెస్‌ ఇనిస్టిట్యూట్స్‌ సజావుగా నడిచేందుకు వీలుగా సపోర్టింగ్‌ స్టాప్‌ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం.

అనంతపురం, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు జిల్లాల్లో పోస్టుల భర్తీకి నిర్ణయం.

# మావోయిస్టుల పై నిషేధం మరో ఏడాది పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.

# ఆంధ్రప్రదేశ్‌ వాల్యూ యాడెడ్‌ టాక్స్‌ (వ్యాట్‌) –2023 బిల్లు సవరణలకు మంత్రిమండలి గ్రీన్‌ సిగ్నల్‌.

# తిరుమల తిరుపతి దేవస్ధానం ఐటీ విభాగం(ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌)లో 34 పోస్టులకు కేబినెట్‌ ఆమోదం.

# శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రెడిషనల్‌ స్కల్ప్చర్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (ఎస్‌వీఐటీఎస్‌ఏ)లో 12 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం.


# పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంను రెవెన్యూ డివిజన్‌గా మార్చాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.

# పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో కొత్త పోలీస్‌ సబ్‌ డివిజన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.

# ఏలూరు జిల్లా ఏలూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని గణపవరం మండలాన్ని భీమవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి మార్చే నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.

# విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలాన్ని చీపురుపల్లి రెవెన్యూ డివిజన్‌ నుంచి విజయనగరం రెవెన్యూ డివిజన్‌కు మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.

# పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలాన్ని గురజాల రెవెన్యూ డివిజన్‌ నుంచి నరసరావుపేట రెవెన్యూ డివిజన్‌కు మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌.

# ఆదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌కు 500 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు అవసరమైన 406.46 ఎకరాల భూమిని.. ఎకరం రూ.5 లక్షల చొప్పున కేటాయించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.

అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం పెద్దకోట్ల, దాడితోట గ్రామాల పరిధిలో భూములు కేటాయించేందుకు ఆమోదం.

# కొత్త జిల్లాల ఏర్పాటు నేపధ్యంలో ప్రజల సౌకర్యార్ధం, పరిపాలనా సౌలభ్యం కోసం వివిధ మండల కేంద్రాల మార్పుతో పాటు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం.

ఎన్టీఆర్‌ జిల్లాలో వీరులపాడు మండల కేంద్రాన్ని జుజ్జూరుకు మారుస్తూ కేబినెట్‌ ఆమోదం.

జిల్లా కేంద్రాల్లో ఉన్న మండలాలను అర్బన్, రూరల్‌ మండలాలగా ఏర్పాటు చేయడానికి కేబినెట్‌ ఆమోదం.

విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల,అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 6 జిల్లా కేంద్ర మండలాలను రూరల్, అర్భన్‌ మండలాలుగా విభజిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌.

ఒంగోలు జిల్లా కేంద్ర మండలాన్ని ఒంగోలు రూరల్, అర్భన్‌ మండలాలుగా విభజిస్తూ నూతన మండలాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం. 

# పశుసంవర్ధకశాఖలో నిపుణుల కొరతను తీర్చేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ పారా వెటర్నరీ అండ్‌ అలైడ్‌ కౌన్సిల్‌ యాక్టు – 2023  డ్రాప్టు బిల్లుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.

దీని ప్రకారం పారా వెటర్నరీ అండ్‌ అలైడ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు.

# జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం.

జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం మరింత మంది విద్యార్ధులకు ప్రయోజనం చేకూరేలా మార్పులుకు కేబినెట్‌ ఆమోదం.

ఇంతకుముందు క్యూఎస్ ర్యాంకింగ్‌లో టాప్‌ -200 విశ్వవిద్యాలయాల వరకే పరిమితం.

ఇకపై దాదాపు 21 సబ్జెక్టులు/ఫ్యాకల్టీలకు సంబంధించి ప్రతి ఒక్క సబ్జెక్టు లేదా ఫ్యాకల్టీలో టాప్‌ 50 కాలేజీలు లేదా విద్యాసంస్ధల్లో  సీటు సాధించినవారికి జగనన్న విదేశీ విద్యాదీవెన వర్తింపు.

గతంలో కేవలం క్యూఎస్ సంస్ధ ర్యాంకింగ్‌ మాత్రమే పరిగణలోకి తీసుకోగా... ఇకపై క్యూఎస్ సంస్ధ ర్యాంకింగ్‌తో పాటు టైమ్స్‌ హయ్యర్ ఎడ్యుకేషన్‌ 

ర్యాంకింగ్ ఆధారంగా సీటు సంపాదించిన వారికి జగనన్న విదేశీ విద్యాదీవెన వర్తింపు. 

ఈ మార్పుల వల్ల 320 కాలేజీలు, విద్యాసంస్ధల్లో విద్యార్ధులకు అందుబాటులోకి రానున్న కోర్సులు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు రూ.1.25 కోట్ల వరకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌.

అర్హులైన ఇతరులకు రూ.1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌.

# ఏపీ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఏపీఎస్‌పీఎఫ్‌)లో 105 అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం.

                                                                             

No comments:

Post a Comment