సంగ్రహణాత్మక మదింపు-1 (డిశెంబరు 2022) పరీక్షల నిర్వహణకు సూచనలు
Proc. of the Commissioner, School Education, vide Rc No:ESE02/941/2022-SCERT, dt:22.12.2022& You-tube video message of Principle Secretary, Dept of School Education, on 29.12.2022.
ఈ సూచనలను ప్రతి మండలవిద్యాశాఖాధికారి, కాంప్లెక్స్ హెడ్మాస్టరు, CRP మరియు అందరూఉపాధ్యాయులు పూర్తిగా చదివి అర్థం చేసుకొనిపరీక్ష నిర్వహించాలి
1. జిల్లా లోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో మరియు ప్రవేట్ యాజమాన్య పాఠశాలలలో SCERT-AP వారి ద్వారా జారీ చేయబడ్డ ప్రశ్నా పత్రాలతో మాత్రమే తేదీ 02.01.2023 నుండి SA-I పరీక్షలు నిర్వహించాలి.
2. 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు 6 పేపర్లలో ( PS, BS కలిపి 1 పేపరు) సంగ్రహణాత్మక మదింపు పరీక్షలు నిర్వహించాలి.
3. ఈ విద్యా సంవత్సరం జిల్లా పరిష్తత్, ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలోని విద్యార్థులకు 1 వ తరగతి నుండి 8 తరగతి వరకు గల విద్యార్థులకు రెండు మీడియం లలో ( TM/EM) ప్రశ్నా పత్రాలను పంపడం జరినది. 9వ మరియు 10వ తరగతుల విద్యార్థులకు, గతంలో మాదిరిగానే SA-I పరీక్షలు. నిర్వహించడం జరుగుతుంది.
4. అన్ని ప్రభుత్వ రంగ యాజమాన్య పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకముగా Maths, Science లలో BYJU’S App లో ఇవ్వబడిన సిలబస్ నుండి తయారుచేయబడిన ప్రశ్నాపత్రములతో పరీక్షలు నిర్వహించాలి (సాధారణ ప్రశ్నా పత్రములను సంక్రాంతి శెలవలలో అసైన్మెంటుగా ఉపయోగించాలి). ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలో సాధారణ ప్రశ్నాపత్రములతో పరీక్షలు నిర్వహించాలి.
మండల విద్యాశాఖాధికారి చేయవలసిన పనులు
పరీక్షలకు ముందు చేయవలసిన పనులు
5. జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం నుండి పంపబడే ప్రశ్నాపత్రాలను, పాఠశాల వారి విద్యార్థుల సంఖ్యలను తెలుపు లిస్టులను తీసుకొని సరి చూసుకొనవలెను. ప్రశ్నాపత్రాలను మండల విద్యాశాఖాధికారి మరియు ఒక సీనియర్ ప్రధానోపాధ్యాయుని సమక్షములో స్ట్రాంగ్ రూమ్ లో కానీ తాళముల వేసిన బాక్స్ లలో గాని భద్రపరచి వారి కస్టడీలో ఉంచుకొనవలెను.
6. అట్లే 1 నుండి 5వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను కాంప్లెక్స్ వారీగా విభజించుకొని, 02.01.2023 వ తేదీ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ కు ఇచ్చి మరల వారు పరీక్ష రోజులలో వారి కాంప్లెక్స్ లోని పాఠశాలలకు రోజువారి ఇవ్వవలసి నట్లుగా తెలియజేయవలెను.
7. జిల్లా పరిష్తత్, ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలోని 1 వ తరగతి నుండి 5 తరగతి వరకు గల విద్యార్థులకు రెండు మీడియం లలో ( TM/EM) ప్రశ్నా పత్రాలను ఇవ్వవలెను. ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాల లకు EM ప్రశ్నా పత్రాలను ఇవ్వవలెను.
పరీక్షల సమయంలోచేయవలసిన పనులు
8. 6 నుండి10వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను అన్ని పాఠశాలలకు MRC నుండి మాత్రమే ప్రతిరోజు టైం టేబుల్ అనుసరించి పరీక్షకు ఒక గంట ముందుగా ఇవ్వవలెను.
9. 07.01.2023 వ తేదీ అన్ని తరగతులకు గణితము పరీక్ష, కానీ అన్ని యాజమాన్య పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకముగా సాంఘీక శాస్త్రం పరీక్ష నిర్వహించాలి
10. అట్లే 09.01.2023, 10.01.2023 తేదీలలో 8వ తరగతి విద్యార్థులకు వరుసగా General Science, Mathematics ప్రశ్నాపత్రములను ఇవ్వాలి. ప్రభుత్వ రంగ యాజమాన్య పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకముగా General Science, Mathematics లలో BYJU’S App లో ఇవ్వబడిన సిలబస్ నుండి తయారుచేయబడిన ప్రశ్నాపత్రములను కూడా ఇవ్వాలి.
పరీక్షల అనంతరం చేయవలసిన పనులు
11. పరీక్షల అనంతరం అనగా, 07.01.2023 తేదీ నుండి 10.01.2023 తేదీ వరకు మీ మండలములోని అన్ని ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయులు జవాబు పత్రములను కీ తయారు చేసికొని మూల్యాంకనము చేసిందీ/లేనిది పర్యవేక్షించాలి.
కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు చేయవలసిన పనులు
12. కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లు వారి కాంప్లెక్స్ కు సంబంధించిన అన్ని పాఠశాలల యొక్క తరగతి వారి విద్యార్థుల సంఖ్య లతో కూడిన లిస్టులను, 1 నుండి 5వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను MRC నుండి CRP ద్వారా 02.01.2023 వ తేదీ తెప్పించుకొని తమ కస్టడీలో ఉంచుకొనవలెను.
13. ప్రతి పరీక్ష రోజు పాఠశాలకు కేటాయించబడిన ప్రశ్నాపత్రాలను, పరీక్షకు గంట ముందు మాత్రమే ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు ఇవ్వవలెను.
14. పరీక్షల అనంతరం అనగా, 07.01.2023 తేదీ నుండి 10.01.2023 తేదీ వరకు మీ మండలములోని అన్ని ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయులు జవాబు పత్రములను కీ తయారు చేసికొని మూల్యాంకనము చేసిందీ/లేనిది పర్యవేక్షించాలి.
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు సూచనలు
పరీక్షలకు ముందు చేయవలసిన పనులు
15. మొదటగా మీ పాఠశాలలోని ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు సబ్జెక్టువారీ సిలబస్ లను తెలియజేయండి. 8వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకముగా Maths, Science లలో BYJU’S App లో ఇవ్వబడిన సిలబస్ ను తెలియజేయండి.
పరీక్షల సమయంలోచేయవలసిన పనులు
16. 6 నుండి పదవ తరగతి విద్యార్థుల యొక్క ప్రశ్నాపత్రాలను ఏ రోజుకు ఆ రోజు MRC నుండి పరీక్షకు ఒక గంట ముందు తీసుకొని పాఠశాలకు రావలెను
17. అన్ని తరగతుల వారికి సబ్జెక్ట్ వారీగా పరీక్షా సమయం టైం టేబుల్ ప్రకారమే అనుమతించాలి.
18. 07.01.2023, 09.01.2023, 10.01.2023 తేదీలలో 8వ తరగతి విద్యార్థులకు వరుసగా Social Studies, General Science, Mathematics ప్రశ్నాపత్రములను ఇవ్వాలి. ప్రభుత్వ రంగ యాజమాన్య పాఠశాలలో ప్రత్యేకముగా General Science, Mathematics లలో BYJU’S App లో ఇవ్వబడిన సిలబస్ నుండి తయారుచేయబడిన ప్రశ్నాపత్రములను ఇచ్చి పరీక్ష నిర్వహించాలి.
19. జిల్లా పరిష్తత్, ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలోని 1 వ తరగతి నుండి 8 తరగతి వరకు గల విద్యార్థులకు రెండు మీడియం లలో ( TM/EM) ప్రశ్నా పత్రములను ( గౌరవ ప్రింసిపల్ సెక్రటరీ, విధ్యాశాఖ వారు 29.12.2022 నాడు ఇచ్చిన సందేశము ప్రకారం) ఇచ్చి ఎంతెంత మంది విధ్యార్ధులు ఏయే మీడియం లలో పరీక్ష వ్రాయగలరో పరిశీలించాలి.
పరీక్షల అనంతరం చేయవలసిన పనులు
20. ఉపాధ్యాయులు వారివారి సబ్జెక్టులలో స్వయముగా కీ తయారుచేసికొని విద్యార్థుల వద్ద నుండి ప్రతి రోజు పరీక్ష తదనంతరం వెనుకకు సేకరించిన జవాబు పత్రములను మూల్యాంకనము చేయాలి. విద్యార్థులు పొందిన మార్కులను సంబంధిత రిజిస్టర్లు నందు నమోదు చేయడంతో పాటు, నిర్ణీత సమయం లోపల CSE సైట్ నందు ఎంటర్ చేయాలి. జవాబు పత్రాలను తనిఖీ అధికారుల పరిశీలనార్థం భద్రపరచాలి.
21. ప్రభుత్వ రంగ యాజమాన్య పాఠశాలలో 8వ తరగతి విధ్యార్ధులకు ప్రత్యేకముగా General Science, Mathematics లలో ఇవ్వబడిన సాధారణ ప్రశ్నా పత్రములను సంక్రాంతి శెలవలలో అసైన్మెంటుగా ఉపయోగించాలి.
22. విద్యార్థులు పొందిన మార్కులను ప్రోగ్రెస్ కార్డులందు నమోదుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పంపాలి. తక్కువ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయులు-తల్లిదండ్రుల సమీక్షా సమావేశంలో SA-I నందు విద్యార్థులు చూపిన ప్రతిభపై చర్చించాల
No comments:
Post a Comment