ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2023 అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది.
జనవరి 28, 29,30 తేదీల్లో పరీక్ష జరిగే వారి అడ్మిట్ కార్డులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
పేర్కొన్న తేదీలలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)- 2023 సెషన్ 1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక సైట్ https://nta.ac.in/ ద్వారా అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
B.Arch పరీక్ష, B.Planning (పేపర్ 2A & పేపర్ 2B) జనవరి 28న 285 నగరాలు, 343 కేంద్రాలలో సుమారు 0.46 లక్షల మంది అభ్యర్థులకు నిర్వహిస్తారు.
BE/B.Tech (పేపర్ I) పరీక్ష 278 నగరాలు, 507 కేంద్రాలలో 2.87 లక్షల మంది అభ్యర్థులకు జనవరి 29, 30 తేదీలలో జరుగుతుంది.
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా.
jeemain.nta.nic.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
హోంపేజీలో జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు 2023 సెషన్-1కు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి.
మీ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ ఇవ్వాలి.
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఆ తర్వాత డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆ కాపీని ప్రింటవుట్ తీసుకోవాలి.
కార్డుపై మీరు పరీక్ష రాసే నగరం, ఇతర వివరాలన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి.
ఏదైనా సమస్య ఉంటే jeemain@nta.ac.in ద్వారా ఎన్టీఏకి మెయిల్ చేయవచ్చు.
దేశంలోని ట్రిపుల్ ఐటీలు, ఎన్ఐటీ, ఇతర విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి సంవత్సరం జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తున్నారు.
మెయిన్ లో అర్హత సాధించిన వారికి అడ్వాన్స్‌లో పరీక్ష నిర్వహిస్తారు.
ఇందులో వచ్చే ర్యాంక్ ఆధారంగా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
No comments:
Post a Comment