APTF VIZAG: బొబ్బిలి మున్సిపల్ పాఠశాలలో ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆకస్మిక తనిఖీ. సంబంధిత ఉపాధ్యాయుడును సస్పెండ్ చేస్తూ నిర్ణయం.

బొబ్బిలి మున్సిపల్ పాఠశాలలో ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆకస్మిక తనిఖీ. సంబంధిత ఉపాధ్యాయుడును సస్పెండ్ చేస్తూ నిర్ణయం.

బొబ్బిలి మున్సిపల్ పాఠశాలలో ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆకస్మిక తనిఖీ. ఆన్లైన్ పోర్టల్ లో మార్కులు అప్లోడ్ చేయకపోవడం పట్ల విస్మయం. సంబంధిత ఉపాధ్యాయుడును సస్పెండ్ చేస్తూ నిర్ణయం.

పర్యవేక్షణ లోపం తేటతెల్లం చేస్తుందంటూ ఆగ్రహం.

ఫర్నిచర్ పూర్తిస్థాయిలో సమకూర్చకపోవడం సరికాదoటూ హితబోధ.పాఠశాల విద్య ఆర్జెడి,ఎస్ఎస్ఎ పిఓ లకు చార్జ్ మెమోలు జారీ.

విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో నరేంద్ర దేవి ప్రాథమిక పాఠశాలను పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో గల మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం ఉపాధ్యాయులు చేపడుతున్న బోధన విధానాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలను,వాటికి సంబంధించిన జవాబు మూల్యాంకన పత్రాలను పరిశీలించారు.వీటికి సంబంధించిన మార్కులను ఆన్లైన్లో పోర్టల్ లో అప్లోడ్ చేయకపోవడం పట్ల సంబంధిత ఉపాధ్యాయుడు ప్రవీణ్ ను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఎస్ ఏ పరీక్షలు నిర్వహించి రోజులు గడిచినా,ఇప్పటివరకు మూల్యాంకన చేయకపోవడం విధి నిర్వహణలో అలసత్వాన్ని తేట తెల్లం చూస్తుందన్నారు.ఆలస్యంగా మూల్యాంకన చేసినప్పటికీ, ఇంతవరకు మార్క్ లను ఆన్లైన్ పోర్టల్ లో ఎందుకు అప్లోడ్ చేయలేదని ప్రశ్నించారు.తన పర్యటన వివరాలను సర్కులర్ రూపంలో దిగువ స్థాయి సిబ్బందికి తెలియజేయకపోవడం పట్ల పాఠశాల విద్య ఆర్జెడి జ్యోతి కుమారి కి చార్జ్ మెమో జారీ చేశారు. పాఠశాలలో పూర్తిస్థాయిలో విద్యార్థులకు కూర్చునేందుకు ఫర్నిచర్ లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యుడిని చేస్తూ సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కు చార్జ్ మెమో జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తన పరిధిలో గల అన్ని యాజమాన్యాల ప్రభుత్వ విద్యా సంస్థలకు సరిపడా ఫర్నిచర్ వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు.జిల్లా పరిధిలో ఉండే విద్యా సంస్థలకు సరిపడా ఫర్నిచర్ వివరాలు తెలియకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏది ఏమైనప్పటికీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ పర్యటన ఉపాధ్యాయ వర్గాల్లో గుబులు రేపుతుంది.


No comments:

Post a Comment