గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. ఏపీపీఎస్సీ తన వెబ్ సైట్ లో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ఉంచింది. మెయిన్స్ కు ఎంపికైన 6,455 మంది అభ్యర్థుల జాబితాలను వెబ్ సైట్ (psc.ap.gov.in) లో పొందుపరిచింది. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులు అర్హత పొందినట్టు ఏపీపీఎస్సీ వివరించింది.
111 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ జనవరి 8న పరీక్ష నిర్వహించింది. ఈ వడపోత పరీక్షకు 87,718 మంది హాజరయ్యారు. మొత్తం 297 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమ్స్ నిర్వహించారు.
కాగా, పరీక్ష నిర్వహించిన మూడు వారాల్లోనే ఫలితాలు విడుదల చేయడం ఏపీపీఎస్సీ చరిత్రలో ఇదే తొలిసారి. ప్రిలిమ్స్ కు సంబంధించి ఏపీపీఎస్సీ ఇటీవల కీ కూడా విడుదల చేసింది.
ఇక గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ను కూడా ఏపీపీఎస్సీ నేడు వెల్లడించింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు గ్రూప్-1 మెయిన్స్ జరుగుతాయని తెలిపింది.
No comments:
Post a Comment