APTF VIZAG: బదిలీలలG.O 187 పై బొత్స సత్యనారాయణ గారిని , జాయింట్ డైరెక్టర్ రామలింగం గారిని కలిసిన "ఉపాధ్యాయ సంఘాలు" ప్రాతినిధ్యం చేసిన సమాచారం

బదిలీలలG.O 187 పై బొత్స సత్యనారాయణ గారిని , జాయింట్ డైరెక్టర్ రామలింగం గారిని కలిసిన "ఉపాధ్యాయ సంఘాలు" ప్రాతినిధ్యం చేసిన సమాచారం


👉ఉపాధ్యాయుల బదిలీల ఉత్తర్వులు లోని అసంబద్ధాలను తొలగించాలని , మరియు జీతాలు సమస్య మీద  విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ గారిని , జాయింట్ డైరెక్టర్ రామలింగం గారిని కలిసిన "ఉపాధ్యాయ సంఘాలు" ప్రాతినిధ్యం చేయడం జరిగింది

     👉 జీతాలు సమస్య పరిష్కరిస్తామని మంత్రి గారు తెలిపారు.

    👉   రీఅప్పోర్షమెంట్ గురయ్యే "వారందరికీ" రీఅప్పోర్షమెంట్ పాయింట్లు మరియు స్పెషల్ పాయింట్లు ఇవ్వాలని కోరడం జరిగింది

     👉JD గారు గతంలో ఇవ్వలేదు కదా అని తెలపగా గత ఉత్తర్వులలో ఇచ్చారని , "రీఅప్పోర్షమెంట్ కు గురయ్యే అందరూ కూడా ప్రభుత్వ విధానాలు మారడం వల్లేనని

" UP లో 98 రోల్ వల్ల"

",HSలో  తెలుగు మీడియం ను పరిగణనలోకి తీసుకోనందున  ",

 ప్రైమరీ లో PSHM మంజూరు వల్ల ,

 కేటగిరీ4 లో గతంలో బ్లాక్ చేయకుండా 2 పోస్టులు ఇవ్వడం వంటివన్నీ కూడా ప్రభుత్వ విధానాలు వల్లేనని వివరించడం జరిగింది. JD గారు నోట్ చేసుకున్నారు

    👉పై అంశం మీద మంత్రి గారు మొదట 2021లో బదిలీ పొంది వుంటే వారికి పాయింట్లు ఇస్తామని తెలిపారు. సమస్యను వివరించిన మీదట కమీషనర్ గారికి ఫోన్ చేసి ఎవరైతే మన విధానాలు వల్ల ఎఫెక్ట్ అవుతారో వారికి పాయింట్లు ఇవ్వండి అని చెప్పారు.

👉 గతంలో ఉన్న హెల్త్ గ్రౌండ్స్ అన్నింటికీ ప్రిఫరెన్షియల్ కేటగిరీ వర్తింపచేయాలని కోరగా JD గారు నోట్ చేసుకున్నారు

👉 జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి లకు పాయింట్లు మీద "హామీ ఇవ్వలేదు"

👉 ఖాళీలు బ్లాక్ గురించి JD గారు ఒక రెగ్యులర్ టీచర్ ను స్కూల్ లో వుంచి రెండవ వ్యక్తి గా MTS వారిని వుంచుతామన్నారు

  👉  ప్రమోషన్ పొందినవారికి, PET లకు left over vacancies Manual గా ఇస్తామని తెలిపారు

👉   సబ్జెక్ట్ కన్వర్షన్ పొందిన వారికి "పాత సబ్జెక్ట్ "కు వచ్చిన విధంగా పాయింట్లు వస్తాయని తెలిపారు

👉  6 నెలల లోపు మెడికల్బోర్డు నుండి సర్టిఫికెట్ పొంది వుంటే మరలా తెచ్చుకోనవసరం లేదు

👉  ఈసారి మంచి సాఫ్ట్వేర్ వాడుతున్నామని ఎటువంటి సర్వర్ సమస్యలు వుండవని తెలిపారు

👉వెబ్ ఆప్షన్లు పెట్టేటప్పుడు మొదటి రోజు SGT లు తప్ప అందరూ పెట్టుకోవచ్చని , రెండవరోజు నుండి అందరూ పెట్టుకోవచ్చని IT సిబ్బంది తెలిపారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today