APTF VIZAG: clarifications and additional instructions on Transfers, 2022 Last date for applying for online transfer extended upto 19.12.2022.

clarifications and additional instructions on Transfers, 2022 Last date for applying for online transfer extended upto 19.12.2022.

బదిలీలు దరఖాస్తు డిసెంబర్ 19వ తారీకు మరొక రోజు గడువును పొడిగించిన ప్రభుత్వం. అలాగే కొన్ని సవరణ ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం.

Click Here To Download revised guidelines 


CSE వారు ది18.12.22 తేది.Rc.No:14 తో జారీ చేసిన బదిలీ క్లారిఫికేషన్‌లలోని ముఖ్య అంశాలు:

👉 CSE Procgs Dt:14.10.2021 మార్గదర్శకాల ప్రకారం Oct 2021 లో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు బదిలీల కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. అయితే, 31.08.2024 లేదా అంతకు ముందు పదవీవిరమణ చేయబోయే వారికి ఈ విషయంలో మినహాయింపు ఉంది

👉40%తో విజువల్లీ ఛాలెంజ్డ్ టీచర్లందరూ , 80% మరియు అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న OHకి బదిలీల నుండి మినహాయింపు ఉంది.

👉మండలంను యూనిట్‌గా తీసుకొని I, II, మరియు III కేటగిరీలలో దామాషా ప్రకారం అదే సంఖ్యలో ఖాళీలను బ్లాక్ చేయడం జరుగును.


స్కూల్ అసిస్టెంట్లు (SAs) బ్లాకింగ్

👉హైస్కూళ్లలో ఖాళీలు ఏవీ బ్లాక్ చేయవడవు (అంటే 3-10/ 6-10 తరగతులు)

👉98 కంటే ఎక్కువ స్త్రెంత్ ఉన్న ప్రీ హైస్కూల్స్‌లో ఖాళీలు దామాషా ప్రకారం (Blocking) నిరోధించబడతాయి. ఏవైనా ఖాళీలు మిగిలి ఉంటే, స్త్రెంత్ తక్కువగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో (6-10) ఖాళీలను బ్లాక్ చేయండి

సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGTలు) బ్లాకింగ్


👉ఫౌండేషనల్ స్కూల్స్/ఫౌండేషనల్ స్కూల్ ప్లస్ స్త్రెంత్ 21 నుండి 30 వరకు - ఖాళీలు దామాషా ప్రకారం బ్లాక్ చేయబడతాయి.

👉ఏదైనా ఖాళీలు మిగిలి ఉంటే, అత్యధిక క్యాడర్ స్ట్రెంత్ (పోస్టులు) ప్రకారం ఫౌండేషన్ స్కూల్స్/ఫౌండేషనల్ స్కూల్ ప్లస్‌లలో ఖాళీలను బ్లాక్ చేయండి.

కీలక సవరణలు

👉పునర్విభజన ద్వారా ప్రభావితమైన ప్రధానోపాధ్యాయులు (Gr.II)/ఉపాధ్యాయులు (మ్యాపింగ్‌తో సంబంధం లేకుండా అన్ని సందర్భాలు) ఇప్పటికే సురక్షిత పాయింట్‌ల కంటే ఎక్కువ అదనపు పాయింట్‌లకు అర్హులైన వారికి పునర్విభజన పాయింట్‌లు (5) ఇవ్వబడతాయి.

👉జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శులకు (5) ప్రత్యేక పాయింట్లకు అర్హులు ( 5/8 సం లకు ఒకసారి మాత్రమే)

👉హెడ్‌మాస్టర్ (Gr.II)/టీచర్ ద్వారా ఆన్‌లైన్ బదిలీకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 19.12.2022 వరకు పొడిగించబడింది.

👉DEO పూల్/ప్రీ-హైస్కూల్‌లోని అన్ని భాషా పండిట్‌లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాలి.

👉DDO ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తుల వెరిఫికేషన్ కోసం చివరి తేదీ 20.12.2022 వరకు పొడిగించబడింది.

No comments:

Post a Comment