APTF VIZAG: తత్కాల్ లో ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలు

తత్కాల్ లో ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలు

 

ఒపెన్ టెన్త్, ఇంటర్మీడియట్లో తత్కాల్ ప్రవేశాల షెడ్యూల్ను ఎపి ఒపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ కెవి శ్రీనివాసులు రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు అడ్మిషన్లు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారులు, ఒపెన్ స్కూల్ సొసైటీ అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్లను నిర్ధారించి ఫీజులు కట్టించుకోవాలని తెలిపారు. ఎస్ఎస్సి అభ్యర్థుల నుంచి రూ.300, ఇంటర్మీడియట్ అభ్యర్థుల నుంచి రూ.400 చొప్పున ఫీజు వసూలు చేయాలని వెల్లడించారు.

No comments:

Post a Comment