AP Summative 1 జనవరి 2023 పరీక్షల టైం టేబుల్ విడుదల చేసిన CSE & SCERTAP SA 1. జనవరి 2 నుండి 10 వరకు నిర్వహణ.8వ తరగతి గణితం మరియు జనరల్ సైన్స్ పరీక్ష ప్రభుత్వం అందించిన ట్యాబ్ లలో నిర్వహించాలి. 1 నుండి 10 వ తరగతుల వరకు సమ్మేటివ్ 1 పరీక్షల టైం టేబుల్ క్రింది లింకు లో కలదు.
Click Here To Download proceedings
రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లోని విద్యార్థులకు జనవరి 2వ తేదీ నుంచి సమ్మేటివ్ అసెస్మెంటు-1 పరీక్షలు పాఠశాల విద్యాశాఖ నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి గారు గురువారం షెడ్యూల్ విడుదల చేశారు. 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు జనవరి 4 నుంచి 7వ తేదీ వరకు ఎస్‌ఏ-1 పరీక్షలు జరుగుతాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు జనవరి 2 నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తారు.
ఆయా తరగతుల పరీక్షల షెడ్యూల్ ఇలా.
1 నుంచి 5 తరగతుల విద్యార్థులు :
ఎలిమెంటరీ తరగతులకు (1-5) చెందిన విద్యార్థులకు 4వ తేదీ నుంచి 7 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి. ఎలిమెంటరీలోని అన్ని తరగతులకు 4న ఫస్ట్ లాంగ్వేజ్, 5న ఇంగ్లిషు, 6న మేథమెటిక్స్ పరీక్షలుంటాయి. ఇక 7వ తేదీన 3, 4, 5 తరగతుల వారికి ఎన్విరాన్మెంటల్ సైన్సు పరీక్షలుంటాయి.
6 నుంచి 10 తరగతుల విద్యార్థులు:
ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంటు-1 పరీక్షలు 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 వరకు 6, 8, 10 తరగతులకు, మధ్యాహ్నం 1.30 నుంచి 4.45 వరకు 7, 9 తరగతులకు పరీక్షలు జరుగుతాయి.
6-10 తరగతుల పరీక్షల షెడ్యూల్ ఇలా ..
► జనవరి 2న 6, 8, 10 తరగతులకు ఓఎస్సెస్సీ పేపర్-1 పరీక్ష ఉంటుంది. 7, 9 తరగతులకు కాంపోజిట్ కోర్సు సంస్కృతం, హిందీ, అరబిక్ పర్షియా పేపర్-1 పరీక్ష
► జనవరి 3న 8, 10 తరగతులకు ఓఎస్సెస్సీ పేపర్-2 పరీక్ష, మధ్యాహ్నం 9వ తరగతికి కాంపోజిట్ కోర్సు పేపర్-2 పరీక్ష
► జనవరి 4న ఉదయం, మధ్యాహ్నం 6 నుంచి 10 తరగతులకు ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష
► జనవరి 5న 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష
► జనవరి 6న 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఇంగ్లీషు పరీక్ష
► జనవరి 7న 6, 7, 9, 10 తరగతులకు మేథమెటిక్స్, 8వ తరగతికి సోషల్ స్టడీస్ పరీక్ష
► జనవరి 9న 6 నుంచి 10 తరగతి వరకు విద్యార్థులకు జనరల్ సైన్సు పరీక్ష
► జనవరి 10న 6, 7, 9, 10 తరగతులకు సోషల్ స్టడీస్ పరీక్ష, 8వ తరగతి విద్యార్థులకు మేథమెటిక్స్ పరీక్ష
► 8వ తరగతి జనరల్ సైన్సు, మేథమెటిక్స్ పరీక్ష పత్రాలు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులకు వేర్వేరుగా ఉంటాయి.
No comments:
Post a Comment