APTF VIZAG: రెండు లక్షల మందిలో 140 బదిలీలు ఏ మాత్రం?రెండు సవరణలకు ప్రభుత్వం ఆమోదం. మంత్రి బొత్స సత్యనారాయణ

రెండు లక్షల మందిలో 140 బదిలీలు ఏ మాత్రం?రెండు సవరణలకు ప్రభుత్వం ఆమోదం. మంత్రి బొత్స సత్యనారాయణ

రాష్ట్రంలో మొత్తం రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటే ఇందులో 140 మందికి సిఫార్సు బదిలీలు చేస్తే అవి ఏ మాత్రమని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విజయవాడలో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో నిర్వహించిన చర్చల అనంతరం విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. 140మంది బదిలీలను అదేదో భూతద్దంలో పెట్టి... 1.40లక్షల మందికి చేస్తున్నట్లు అడుగుతున్నారని, దీనిపై ఏవరైనా నవ్వుతారని పేర్కొన్నారు. ఈ బదిలీల వల్ల ఉపాధ్యాయులకు నష్టమేమి లేదన్నారు. ఈ సిఫార్సు బదిలీలపై ఉపాధ్యాయ సంఘాల వారు ఎవ్వరూ అడగలేదని, తనకు కూడా తెలియదంటూ ఈ అంశాన్ని ముగించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పలు అంశాలపై నిర్వహించిన చర్చల అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. ‘‘బదిలీల సవరణలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాల నాయకులు 10 అంశాలు అడిగారు. వాటిలో రెండు తీసుకున్నాం. ప్రతీది భూతద్దం పెట్టి చూద్దామంటే ఇది స్కాంలు, దోపిడీ కాదు. ప్రజలకు లేని అనుమానాలు కల్పించొద్దు. బదిలీల అంశాల్లో సవరణలను శనివారం ప్రకటిస్తాం. అవసరమైతే షెడ్యూల్‌ను రెండు, మూడు రోజులు పొడిగిస్తాం. పారదర్శకంగా నిర్వహిస్తాం’ అని వివరించారు. యూటీఎఫ్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బైజూస్‌ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని విమర్శించారు. హేతుబద్దీకరణ, పాఠశాలల మ్యాపింగ్‌ కారణంగా నష్టపోతున్న ఉపాధ్యాయులందరికీ అదనపు పాయింట్లు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. 2021లో బదిలీలు పొంది, ఇప్పుడు హేతుబద్దీకరణ, మ్యాపింగ్‌తో బదిలీకి గురవుతున్న వారికి పాత స్టేషన్‌ పాయింట్లు ఇవ్వాలని విన్నవించారు. వీటికి ప్రాథమికంగా అధికారులు ఆమోదం తెలిపారు.

No comments:

Post a Comment