APTF VIZAG: Nishtha 2.0 cource link and 3.0 links

Nishtha 2.0 cource link and 3.0 links

 నిష్టా 2.0 ( సెకండరీ టీచర్లు మరియు హెడ్మాస్టర్లు ) నిష్టా 3.0 ( అంగన్వాడి మరియు ప్రైమరీ టీచర్లు ) కోర్సులో ఎన్రోల్ కానీ లేదా ఎన్రోల్ అయ్యి కోర్సులు పూర్తి చేయని ఉపాధ్యాయులకు బ్యాచ్ -3  ప్రారంభం 

( 17 .10 .2022 నుండి 15. 12. 22 వరకు )


అందరి మండల విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి,

📌  నిష్టా 2.0 మరియు నిష్టా 3.0 కి సంబంధించి ఇదివరకే బ్యాచ్-1,  బ్యాచ్ -2 లు నిర్వహించడం జరిగింది.


📌  ఈ రెండు  విడతలలోనూ 50% ఉపాధ్యాయులు మాత్రమే కోర్సులు పూర్తి చేసి ఉన్నారు ఇంకనూ 50 శాతం మంది ఉపాధ్యాయులు కోర్సులు పూర్తి చేయవలసి ఉన్నది


📌  గౌరవ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కోర్సులో ఎన్రోల్ కానీ మరియు ఎన్రోల్ అయ్యి కోర్సులు పూర్తి చేయని ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా ఖచ్చితముగా బ్యాచ్ మూడు నందు కోర్సులు పూర్తి చేసి సర్టిఫికెట్లను పొందవలెను.


📌  కావున అందరు ఎంఈఓ లు మీ మండల పరిధిలో గల కోర్సులు పూర్తి చేయని ప్రైమరీ, అంగన్వాడి ,సెకండరీ టీచర్లు మరియు హెడ్మాస్టర్ల వివరాలను క్రింద ఇవ్వబడిన లింకుల నుండి సేకరించి వారికి ఇందు వెంట జత చేయబడిన మాడ్యూల్స్ యొక్క లింకులను షేర్ చేసి వారందరూ కోర్సులను ఇచ్చిన గడువు లోపల పూర్తి చేయు విధంగా చర్యలు తీసుకొనవలెను.


📌  కోర్సులు పూర్తి చేయని ప్రైమరీ టీచర్స్ వివరాలను  క్రింద ఇవ్వబడిన లింకు నుండి పొందవచ్చు.

    https://datastudio.google.com/s/iDjFtqpWSPM


📌  కోర్సులు పూర్తి చేయని సెకండరీ ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయుల వివరాలను క్రింద ఇవ్వబడిన లింక్ నుండి పొందవచ్చును.


https://datastudio.google.com/s/gw-2WA1Emc0 


⭐  ముఖ్య గమనిక  :  అందరూ సీఆర్పీలు మీ క్లస్టర్ పరిధిలో కోర్సులు పూర్తి చేయని ఉపాధ్యాయుల వివరాలను పై లింకులు నుండి సేకరించి వారికి ఇందు వెంట జతచేసిన మాడ్యూల్స్ లింకును షేర్ చేసి వెంటనే వారిని కోర్సుల్లో ఎన్రోల్ చేయించి అందరూ ఉపాధ్యాయులు ఇచ్చిన గడువు లోపల నిష్టా కోర్సులను పూర్తి చేసి సర్టిఫికెట్ పొందడానికి సహకరించాలని కోరడమైనది.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results