APTF VIZAG: CBA (CLASS ROOM BASED ASSESSMENT) Exam COMPLETE INFORMATION

CBA (CLASS ROOM BASED ASSESSMENT) Exam COMPLETE INFORMATION

 CBA పరీక్షల్లో 1-3తరగతులకు , 4-8 తరగతులకు పరీక్ష విధానం వేరుగా ఉంటుంది.

OMR  ను BLUE/BLACK 🖊️పెన్ను తో  మాత్రమే బబుల్ చేయాలి.

1,2,3 తరగతుల పిల్లలు సమాధానాలను వారి ప్రశ్నపత్రంలోనే "☑️టిక్ " చేసి గుర్తించాలి, తదుపరి 1,2,3 తరగతులను భోదించే ఆ టీచర్ ముందుగా పిల్లల ప్రశ్నపత్ర0లోని ప్రశ్నలను చదివి వినిపించాలి.తదుపరి విద్యార్థి "☑️టిక్ " సమాధానాలను చూసి OMR షీట్ లో ఆ టీచర్ బబుల్ చేయాలి.

4 నుండి 8 తరగతుల పిల్లలు ప్రశ్నపత్రంలో సరైన సమాధానం ☑️ చేసి సమాధానం వ్రాయాలి. తదుపరి ఆ విద్యార్ధి మాత్రమే OMR షీట్ లో బబుల్ చేయాలి.

రోజువారీ పరీక్ష అనంతరం (1 to 8 class) ప్రశ్నకు విద్యార్ధి సమాధానం రాయక పోతే, ఉపాధ్యాయుడే OMR లో ఆ ప్రశ్న  వద్ద E కి బబుల్ చేయాలి.

పరీక్ష నిర్వహణకు ముందే ప్రతి ఒక్క విద్యార్థి ఓఎంఆర్ షీట్  లో ఉన్న వివరాలు   ఒకసారి ఉపాధ్యాయులు ధ్రువీకరించుకొనవలెను.  తరువాతే మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది.

ఏదేని  OMR షీట్ పాడయితే, BUFFER OMR షీట్  లు MEO ఆఫీస్ వారు అందజేస్తారు.

వాటి యందు టీచర్ MANNUAL గా విద్యార్ధి వివరాలు వ్రాయాలి. ఆ తదుపరి బబుల్ చేయాలి.

ప్రతిరోజు పరీక్ష అనంతరము తిరిగి OMR, ప్రశ్నాపత్రములు తీసుకోవలెను.

విద్యార్థి రాసినటువంటి ప్రశ్నాపత్రములను పరీక్ష నిర్వహించిన పిదప ఉపాధ్యాయులు పాఠశాలలో భద్రపరచుకొనవలెను వాటిని govt వారు ఇచ్చిన సమాధానాలు ఆధారంగామూల్యాంకనం చేయాలి.

ప్రతి రోజు నిర్వహించే సబ్జెక్టు సంభందించిన భాగం లో మాత్రమే bubbling చేసేటట్లు సూచనలు ఇవ్వాలి.ఎందుకనగా మొదటగా ఇంగ్లీష్ సబ్జెక్టు bubbling ఇచ్చారు. కానీ మొదటి పరీక్ష తెలుగు ఉన్నది.

 ఒకే OMR  sheet లో అన్ని సబ్జెక్టులు (ప్రైమరీ 4 సబ్జెక్ట్స్ )కలసి ఉన్నవి.ప్రతి రోజూ పరీక్ష అనంతరం వాటిని జాగ్రత్త గా ఉంచాలి.మరుసటి రోజు కూడా వాటినే ఉపయోగించాలి.

విద్యార్థులు అన్ని పరీక్షలు ఆబ్సెంట్ అయితే ఓఎంఆర్ షీట్ పంపించవలసిన అవసరం లేదు.

విద్యార్థి ఒక పరీక్ష మాత్రమే  రాసినా కూడా PRESENT గా భావించి అతని యొక్క ఓఎంఆర్ షీట్ పంపించవలెను.

మన పాఠశాలలో పేర్లు తొలగించబడిన విద్యార్థులు యొక్క OMR sheets పంపించనవసరం లేదు.

కొత్తగా చేరిన విద్యార్థులకు బఫర్ OMR sheets ఉపయోగించాలి.వారి వివరాలు అందులో రాయాలి

ఎట్టి పరిస్థితుల్లో మాస్ కాపీ చేయించ కూడదు. విద్యార్థులు రాసినటువంటి సమాధానం మాత్రమే బబ్లింగ్ చేయించేటట్లు చూడవలెను.

ప్రతి తరగతికి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్లు ఒక ప్యాకెట్ లో భద్రపరిచి వాటిపైన అటెండెన్స్ సీట్ ఉంచవలెను.

ఈ సూచనలు పాటించి ఈపరీక్షలను విజయవంతం చేయగలరు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today